విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గబ్బర్‌సింగ్!: వీరంగం సృష్టించిన ఆ సిఐ సినిమా పోలీస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Krishna District
విజయవాడ: కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీసు స్టేషన్ ఎదుట ఆదివారం వీరంగం సృష్టించిన మైలవరం సిఐ బంగార్రాజు వృత్తిరిత్యా పోలీసు అయినా, ప్రవృత్తిపరంగా నటుడు. రెండు రోజుల క్రితం జరిగిన ఘటనలో బంగార్రాజు పోలీసు స్టేషన్ ఎదుట రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఓ ప్రేమ వ్యవహారం నేపథ్యంలో యువకుడు మృతి చెందడంతో ఆయన మృతదేహంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆదివారం పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగగా, సిఐ బంగార్రాజు ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపిన ఘటన సంచలనం రేపింది.

సిఐ అయిన బంగార్రాజు సినిమా నటుడు కూడా. ఆయన కథానాయకుడిగా నటించిన ఆధిపత్యం సినిమా ప్రోమో ఇటీవలె విడుదలైంది. చిత్రం కూడా త్వరలో తెరపైకి రాబోతుంది. ఆ సినిమాలో హీరో పాత్ర పోషించిన బంగార్రాజు.. వ్యక్తిగత జీవితంలో తరుచూ ప్రజలపై విలనిజాన్నిచూపుతారనే విమర్శలు ఉన్నాయి.

పోలీసు శాఖలో సినిమా పోలీస్‌గా పేరుగాంచాడు. నటన పైన ఆసక్తి ఎక్కువ. దీంతో సినిమాల్లో నటించేందుకు అధికారికంగానే ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకున్నారట. ఆదివారం ఏ సంబంధం లేని ఆటో డ్రైవర్లను వెంటపెట్టుకొని వచ్చి.. వారి పైనే కాల్పులు జరపడం గమనార్హం.

కాల్పుల సమయంలో హైడ్రామా

సిఐ కాల్పులు జరిపిన సమయంలో హైడ్రామా కొనసాగిందట. బంగార్రాజు కాల్పులు జరుపుతుండగా ఓ అధికారి స్టేషన్ నుంచి బయటకు వచ్చి.. సర్ ఏమిటిది, ఎందుకు కాల్చుతున్నారంటూ ప్రశ్నించారట. అయితే వారి సంగతి తేల్చుతానంటూ బంగార్రాజు మాత్రం ఆగలేదట. దీంతో ముందుగా తనను కాల్చండంటూ సదరు అధకారి గట్టిగా మాట్లాడటంతో అప్పుడు తగ్గారట.

English summary

 Four persons injured when Mylavaram CI Bangaru Raju opened fire after villagers ransacked the police station at G.Konduru village in Krishna district on a Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X