వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొట్టుకున్న కాంగ్రెసు, జగన్ పార్టీ, నలుగురికి గాయాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Clash between YSRC and Congress
యానాం/ఒంగోలు: ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నూతలపాడులో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాల వారు ఒకరి పైన మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాంగ్రెసు పార్టీకి చెందిన ముగ్గురు చీరాల వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తను గుంటూరు ఆసుపత్రికి తరలించారు.

ఆనంద్ హోటల్స్ యజమాని అదృశ్యం

యానాంలోని ఆనంద్ రీజెన్సీ హోటల్ యజమాని రవి శంకర్ ప్రసాద్ అదృశ్యమయ్యారు. సోమవారం యానం ఆనంద్ రీజెన్సీ నుంచి మార్నింగ్ వాక్‌కు వెళ్లిన రవి శంకర్ కనిపించకుండా పోయారు. దీంతో సిబ్బంది ఫిర్యాదు మేరకు యానాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తమ్ముడిపై అన్న దాడి

ఖమ్మం జిల్లాలోని కూనవరం మండలం మెట్టరామవరంలో ఆస్తి తగాదాల కారణంగా తమ్ముడిపై అన్న బాణంతో దాడి చేశాడు. దీంతో తమ్ముడి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. గత కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత రాత్రి తాగి వచ్చిన అన్న.. తమ్ముడిపై బాణంతో దాడి చేశాడు.

మహారాష్ట్రలో ప్రమాదం

మహారాష్ట్రలో జరిగిన ప్రమాదంలో మన రాష్ట్రానికి చెందిన ఇరవై మందికి గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం బాల్యానాయక్ తండావాసులు షిర్డికి వెళ్లారు. వారు శనిశింగాపూర్ వెళ్తుండగా.. వారు ప్రయాణిస్తున్న టాటా సుమోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇరవై మందికి గాయాలయ్యాయి.

English summary
At least Four people were injured when supporters of YSR Congress and Congress activists clashed in a village of Prakasam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X