రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

7కోట్ల దోపిడీ: జగన్‌పార్టీ వ్యక్తి అరెస్ట్, పార్టీ కోసం ఖర్చు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

East Godavari district
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ కాంట్రాక్టు ఉద్యోగిని హత్య చేసి రూ.7.32 కోట్లు దోచుకెళ్లిన కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన కార్యకర్తతో సహా పదకొండుమందిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. గత నెల 24వ తేదిన ఈ సంఘటన జరిగింది. కేసు విచారించిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

నిందితుడు శ్రీధర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యక్తిగా పోలీసుల విచారణలో తేలినట్లుగా తెలుస్తోంది. శ్రీధర్‌తో పాటు మిగతా నిందితులను అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. వారి నుండి రూ.2 కోట్లు, రెండు కార్లను, తొమ్మిది ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మిగతా డబ్బులో కొంత ఖర్చు చేసినట్లు శ్రీధర్ పోలీసులకు తెలిపాడు. మూడు కోట్ల రూపాయలను పార్టీ కోసం ఖర్చు పెట్టానని, కోటి రూపాయలను ఓ సినిమాలో పెట్టుబడిగా పెట్టానని పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. షర్మిల పాదయాత్రకు కూడా ఖర్చు పెట్టినట్లు శ్రీధర్ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. మృతి చెందిన సెక్యూరిటీ గార్డు వద్ద గల సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా ట్రేస్ చేసి పట్టుకున్నట్లుగా తెలుస్తోంది.

అరెస్టైన శ్రీధర్ రెడ్డి స్వస్థలం కాకినాడ. ఆయన మాజీ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడిగా చెబుతున్నారు. కాగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో శ్రీనివాస్ కాంట్రాక్టు ఉద్యోగిని హత్య చేసి రూ.73.2 కోట్లను గత నెల 24న ఎత్తుకెళ్లారు. ఓ సెక్యూరిటీ సంస్థకు చెందిన శ్రీనివాస్ రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఎటిఎంలను పర్యవేక్షిస్తుంటాడు. ఈ రోజు అతను కార్యాలయంలో ఫ్యాన్‌కు వేలాడుతూ చనిపోయి కనిపించాడు. కార్యాలయంలో ఉన్న ఏడు కోట్లకు పైగా డబ్బును ఎత్తుకెళ్లారు.

పార్టీ నేత కాదు: ద్వారంపూడి

శ్రీధర్ రెడ్డి తమ పార్టీకి చెందిన నాయకుడు కాదని, అతను నాలుగు నెలల క్రితమే తమ పార్టీలో కార్యకర్తగా చేరాడని ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి చెప్పారు.

English summary
Political leader Sridhar Reddy along with Ten persons were arrested by East Godavari district police on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X