విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పార్టీ లీడర్స్ అరెస్ట్, ఎమ్మెల్యే కొడుకు కారు-ఆటో ఢీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSRCP
కర్నూలు/విజయవాడ/హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన కేసులో పద్నాలుగు మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులను కృష్ణా జిల్లా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి విజయవాడ నగరంలో ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించిన వారిని ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో ర్యాలీలు, ప్రదర్శనలు నిలిపి వేసినట్లు పోలీసులు చెప్పారు.

ఎమ్మెల్యే కుమారుడి కారు ఢీ

కర్నూలు జిల్లాలో ఓ ఎమ్మెల్యే కుమారుడి వాహనం ఢీకొని పలువురికి గాయాలయ్యాయి. జిల్లాలోని వెంకన్న బావి వద్ద ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడి కారు ప్రయాణీకులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

పసికందు మాయం

చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రసూతి ఆస్పత్రిలో పసికందు అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. గత అర్ధరాత్రి 12 గంటలకు ఓ పసికందును గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లిన ట్లు తెలుస్తోంది. రేణిగుంట మండలం వడ్డెమిట్టకు చెందిన కమల శనివారం ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే పాప అనారోగ్యంతో ఉంది. ఈ సమయంలో సోమవారం ఆస్పత్రి వద్ద అనుమానాస్పదంగా తిరిగిన ఓ మహిళ శిశువును ఎత్తికెళ్లినట్లు అక్కడి సిబ్బంది చెబుతోంది.

రైల్వేలో ఉద్యోగాల పేరుతో మోసం

రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.కోటిన్నర మేర కుచ్చుటోపీ పెట్టిన సంఘటన హైదరాబాదులో వెలుగు చూసింది. ఈ ఘటనలో సిసిఎస్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.

English summary
14 YSR Congress leaders were taken into custody on Tuesday for alleged violation of the election code of conduct by holding a public meeting and rallies in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X