వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త ఇమిగ్రేషన్ లా: భారత ఐటి కంపెనీలపై దెబ్బ

By Pratap
|
Google Oneindia TeluguNews

వర్జీనియా: బాచిలర్స్ డిగ్రీ లేదా దానికి సమానమైన విద్య ఉన్న విదేశీయులు హెచ్ -1బి వీసాలతో అమెరికాలో నిర్దిష్టమైన ప్రాజెక్టులపై తాత్కాలికంగా అమెరికాలో పని చేయవచ్చు. కొన్ని అవసరమైనవాటితో పాటు ఎంప్లాయర్స్ హోదాకు సంబంధించి కొన్ని అటెస్టేషన్లతో కార్మిక శాఖ లేబర్ కండీషన్ అప్లికేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది.

అమెరికా కంపెనీలకు ఐటి సేవలను అందించడానికి బిజినెస్ మోడల్స్‌పై దృష్టి కేంద్రీకరించి భారత కంపెనీలు నాన్ - ఇమిగ్రేంట్ వీసాలను వాడుకుంటున్నాయి. ఆ రకంగా వివిధ ప్రాంతాల్లో స్వల్పకాలిక ప్రాజెక్టులపై వృత్తినిపుణులను అమెరికాలో పని చేయిస్తున్నారు.

పెద్ద మార్పులేమీ లేకుండా ప్రాతినిధ్య సభ బిల్లు ఆమోదం పొందుతుందని భావిస్తున్నారు. దీంతో హెచ్ -1బి వీసాలపై ఆంక్షలు అమలులోకి వస్తాయి. దానివల్ల భారత ఐటి కంపెనీలపై దెబ్బ పడే ప్రమాదం ఉంది. ఈ బిల్లు వల్ల ఫీజు మొత్తాలు, వేతన అవసరాలు పెరుగుతాయి. మొత్తం హెచ్-1బి వీసాలపై కోత పడుతుంది.

 IT companies

హెచ్ -1బి డిపెండెంట్ ఏంప్లాయర్స్‌పై అదనపు పరిమితులు పడుతాయి. హెచ్-1బి ఎంప్లాయర్స్‌పై సెనేట్ బిల్లు వల్ల అదనపు ఫీజు పడుతుంది. అంతేకాకుండా ప్రస్తుతం డిఒఎల్ ప్రకారం ఉన్న వేతన నిర్ణయసూత్రాలను లెక్కించడానికి కొత్త పద్ధతి అమలులోకి వస్తుంది.

విద్యాసంస్థ నుంచి బయటకు వచ్చిన కొత్తవారిని నియమించుకున్నప్పుడు హెచ్- 1బి డిపెండెంట్ ఎంప్లాయర్ కనీసం లెవెల్ 2 వేతనాలను చెల్లించాల్సి వస్తుంది. ఇండస్ట్రీ వైడ్ రిక్రూట్‌మెంట్ ప్రమాణాల ప్రకారం అమెరికా కార్మికులను నియమించుకోవడానికి విశ్వసనీయమైన చర్యలను ఎంప్లాయర్స్ చేపట్టాలి. హెచ్ృ1బి దరఖాస్తుదారులకు ఇచ్చే వేతనం ఇవ్వాల్సి ఉంటుంది.

ఎస్.744 కింద ప్రభుత్వ దర్యాప్తు అధికార యంత్రాంగం కూడా పెరుగుతుంది. దీనివల్ల ఎల్‌సిఎ కోసం డిఒఎల్ సమీక్ష ప్రమాణాలు క్లిష్టంగా మారుతాయి. హెచ్-1బి కింద ఉద్యోగులను నియమించుకునే విషయంలో ఎంప్లాయర్స్‌పై మరిన్ని ఆంక్షలు కూడా అమలవుతాయి. మరో రకంగా చెప్పాలంటే, ఆంక్షల వల్ల భారత ఐటి కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయి.

ఎస్.744 అవుట్ ప్లేస్‌మెంట్, అవుట్ సోర్సింగ్, లీజింగ్ లేదా హెచ్-1బి డిపెండెంట్ ఎంప్లాయర్స్ హెచ్-1బి ఉద్యోగుల ప్లేస్‌మెంట్, సేవల వినియోగం కోసం ఇతర కాంట్రాక్టింగ్ పద్ధతులపై నిషేధం ఉంటుంది. నాన్ హెచ్-1బి డిపెండెంట్ ఎంప్లాయర్స్‌పై అవుట్ ప్లేస్‌డ్ ఉగ్యోగి కోసం 500 డాలర్ల ఫీజు వసూలు చేస్తారు.

హెచ్-1బి వీసాలపై భారత ఐటి కంపెనీలు క్రమం తప్పకుండా కార్మికులను వాడుకుంటున్నాయి. పలు స్థలాల్లో వారితో పనిచేయిస్తున్నాయి. ఈ పద్ధతిపై ఎస్.744 తీవ్రమైన దెబ్బ వేస్తుంది. బిల్లు ఇంకా చట్టం కావాల్సిన స్థితిలో ఉంది.

- రాజీవ్ ఎస్. ఖన్నా
అమెరికాలోని వర్జీనియా నుంచి పనిచేస్తున్న ప్రముఖ అమెరికా ఇమిగ్రేషన్ లాయర్

English summary
H-1B visas allow foreign nationals who hold at least a Bachelor's degree or equivalent in professional subjects to temporarily work in the United States on specific projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X