వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేక రాయలసీమ కోసమే పోరాటం: బైరెడ్డి వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Byreddy Rajasekhar Reddy and anantha venkatarami reddy
కర్నూలు/అనంతపురం: ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు ప్రతి ఒక్క రాయలసీమ నాయకుడు ముందుకు రావాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కర్నూలులో రాయల తెలంగాణ వద్దు - ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ముద్దు అనే నినాదంతో విద్యార్థులు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బైరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

రాయలసీమ నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ గురించి మాట్లాడకపోవడం సిగ్గు చేటు అని ఆయన వ్యాఖ్యానించారు.

రాయలసీమ ప్రజాప్రతినిధులు డబ్బు సంపాదనను పక్కన పెట్టి ప్రత్యేక రాయలసీమ సాధన దిశగా కదలాలని ఆయన కోరారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ముందుకు రాని ప్రజాప్రతినిధుల సమాధి కడుతామని ఆయన హెచ్చరించారు.

రాష్ట్ర విభజన జరగదు: అనంత

రాష్ట్రం ఎట్టి పరిస్థితులలో విడిపోదని కాంగ్రెస్ రాయలసీమ ప్రాంత పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఈనెల 12న రాష్ట్ర విభజనపై ప్రకటన వస్తుందన్నది ఊహాగానామేనని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో కొట్టిపారేశారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల రోడ్‌మ్యాప్‌లను హైకమాండ్ పరిశీలిస్తోందని తెలిపారు.

రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తే బాగుంటుందని వెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రం విడిపోతే ఎక్కువ నష్టపోయేది రాయలసీమ ప్రాంతమేనని ఆయన స్పష్టం చేశారు.

English summary
Rayalaseema Parirakshana Samithi founder Byreddy Rajasekhar Reddy has called upon Rayalaseema leaders to fight for separate Rayalaseema state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X