వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదవి: చిన్నల్లుడు శిరీష్ నోట చిరు నినాదం, మోడీకి జై

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Sirish Bharadwaj says he will fight for social justice
హైదరాబాద్: చిరంజీవి చిన్న కూతురు శ్రీజను ప్రేమ వివాహం చేసుకొని శిరీష్ భరద్వాజ్ ప్రముఖంగా వార్తల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శ్రీజ, శిరీష్ భరద్వాజ్‌లు విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో శ్రీజను పెళ్లాడిన శిరీష్ ఐదు నెలల క్రితం భారతీయ జనతా పార్టీలో చేరారు. తాజాగా ఆయనను పార్టీ రాష్ట్ర అధిష్టానం మీడియా పబ్లిసిటీ ఇంఛార్జిగా నియమించింది.

ఈ సందర్భంగా ఆయన ఓ ఛానల్‌తో మాట్లాడారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతానని అన్నారు. (చిరంజీవి సామాజిక న్యాయం అంటూ ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు) తాను పార్టీ కోసం సైనికుడిలా పని చేస్తానని, పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పారు. హార్డ్ వర్క్ చేస్తే బిజెపిలో తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. తమది ఏ ఒక్కరికి లొంగే పార్టీ కాదన్నారు.

కాంగ్రెసుపై విమర్సలు

ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ అవినీతిమయమైందన్నారు. రోజుకో మంత్రి అవినీతి బయటకు వస్తోందని విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే బిజెపికే సాధ్యమన్నారు. రాష్ట్రంలో అధ్యక్షుడు కిషన్ రెడ్డి, దేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో 2014 ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందన్నారు.

పార్టీలకతీతంగా అందరూ మోడీని ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారన్నారు. మోడీ ప్రధానమంత్రి కావాలన్నదే ప్రజల అభిమతమన్నారు. పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమన్నారు. కాగా శిరీష్ భరద్వాజ్ ఇటీవలే నరేంద్ర మోడీని కలుసుకున్నారు.

English summary
BJP leader Sirish Bharadwaj said that he will fight for social justice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X