వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారికీ ఓ పార్టీ: జగన్‌పై రేవంత్, షర్మిలది పిల్లి తీర్థయాత్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: రాజన్న, జగనన్న ఆశయాలు దోపిడీయేనా అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి బుధవారం ప్రశ్నించారు. దోపిడీదారులకు ఓ పార్టీ ఉంటుందని జగన్ పార్టీ నిరూపించిందన్నారు. ఏడు కోట్ల రూపాయల దొంగతనం కేసులో రాజమండ్రిలో ఒక వ్యక్తి, దొంగ డబ్బు చలామణి కేసులో విశాఖలో ఓ మహిళా అరెస్టైన విషయం తెలిసిందే. వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన వారు. ఈ అంశంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

పలు కుంభకోణాలు, దోపిడీలలో జగన్ పార్టీ నేతలను పలువురిని విచారించాలని డిమాండ్ చేశారు. దోపిడీ కేసులో అరెస్టైన శ్రీధర్ రెడ్డి వాంగ్మూలాన్ని బయట పెట్టాలన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలను కాపాడుతున్నారని ఆరోపించారు. జగన్ పార్టీ దొంగల పార్టీ, దోపిడీ పార్టీ అన్నారు. ఆ పార్టీ వారు బరితెగించి వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు.

రాజమండ్రి కేసును తొక్కిపేట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాజమండ్రి దోపిడీ కేసులో ఆ పార్టీకి చెందిన ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి పాత్ర పైన అనుమానాలు వ్యక్తం చేశారు. ద్వారంపూడి వందల కోట్లు సంపాదించారని, ఆయన అవినీతి బాగోతం తాము బయటపెడతామన్నారు.

దొంగలకు అడ్డా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అని, హంతకులకు, దోపిడీదారులకు, నకిలీ నోట్ల ముఠాకు ఓ పార్టీ ఉందని ఆ పార్టీ నిరూపించిందన్నారు. దొంగలు, గజదొంగలు జగన్ గూటికి చేరుతున్నారని విమర్శించారు. జగన్, కిరణ్ తోడు దొంగలే అన్నారు. అందుకే ఆ పార్టీ నేతలను ముఖ్యమంత్రి కాపాడుతున్నారని ఆరోపించారుత.

షర్మిల పైనా మండిపాటు

షర్మిల పాదయాత్ర వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలా ఉందని ఎద్దేవా చేశారు. జగన్‌ను అన్యాయంగా జైలులో పెడితే కోర్టులో ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. దోపిడీదారులు, దొంగనోట్ల చలామణిదారులకు జగన్ పార్టీ అడ్డా అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వేరుగా అన్నారు.

విహెచ్‌కు గోనె సవాల్

తమ పార్టీపై మండిపడ్డ వి హనుమంత రావు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వి హనుమంత రావు మండిపడ్డారు. విహెచ్ చరిత్ర అందరికీ తెలుసునన్నారు. ఆయన చరిత్రపై బహిరంగ చర్చకు సిద్ధమని, పర్సెంటేజీలకు నిధులు అమ్ముకున్న చరిత్ర ఆయనదన్నారు.

English summary
Telugudesam Party leader Revanth Reddy has alleged that YSR Congress Party is thieves party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X