వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గజదొంగలు: బాబు, కాంగ్రెస్‌పై జగన్ పార్టీ రివర్స్ అటాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

sobha nagi reddy
హైదరాబాద్/కర్నూలు: కోలా కృష్ణమోహన్‌కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న సంబంధమేమిటో అందరికీ తెలుసునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి బుధవారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దొంగల పార్టీ, గజదొంగల పార్టీ అన్న కాంగ్రెసు పార్టీ నేత వి హనుమంత రావు, తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన ఆమె తీవ్రంగా మండిపడ్డారు. పార్టీకి చెందిన ఇతర నేతలు కూడా రివర్స్ అటాక్ ప్రారంభించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఎల్లో కూటమి చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మరని శోభా అన్నారు. పార్టీకి సంబంధం లేని విషయాన్ని ఎలా అంటగడతారని ఆమె ప్రశ్నించారు. కోలా కృష్ణ మోహన్ తనకు రూ.10 లక్షలు ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడే చెప్పారన్నారు. టిడిపి, కాంగ్రెసు కుట్రలో భాగంగానే తమ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెసు, టిడిపిలే గజదొంగ పార్టీలు అన్నారు. నిన్న అరెస్టైన శ్రీధర్ రెడ్డికి తమ పార్టీలో సభ్యత్వమే లేదన్నారు. టిడిపి నేత కృష్ణయాదవ్ జైలుకు వెళ్లాడని, వి హనుమంత రావు డీజిల్ దొంగ అని ఆరోపించారు.

రేవంత్ పిల్ల కాకి: గట్టు

టిడిపి నేత రేవంత్ రెడ్డి ఓ పిల్ల కాకి అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గట్టు రామచంద్ర రావు మెదక్‌లో మండిపడ్డారు. టిడిపి కాకి గోలకు తమ పార్టీ బెదిరేది లేదన్నారు. కాంగ్రెసు రెండు తలల పాము కాదని, మూడు తలల విషనాగు అన్నారు. రాజకీయ ప్రాధాన్యత కోసమే రాష్ట్రం విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తోందన్నారు.

జోగి రమేష్ ఫైర్

కత్తి, కర్ర అవసరం లేకుండా హత్య చేయగల సమర్థుడు చంద్రబాబు అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జోగి రమేష్ అన్నారు. ఎన్టీఆర్‌ను మానసిక క్షోభకు గురి చేసి హత్య చేశాడన్నారు. ప్రతిపక్ష నేతగా కూడా దోపిడీ చేయగల సమర్థుడన్నారు. కాంగ్రెసు నుండి ఎన్ని వేల కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారో చెప్పాలన్నారు. దోచుకున్న డబ్బు దాచుకునేందుకే ఆయన అమెరికా వెళ్లినట్లు చెప్పారు.

English summary
YSR Congress Party started reverse attack on Telugudesam and Congress Party over V Hanumantha Rao and Revanth Reddy comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X