వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రథయాత్ర: ప్రారంభించిన మోడీ, విదేశీ భక్తులు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

పూరీ/అహ్మదాబాద్: పూరీ జగన్నాథుడి రథయాత్ర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. రథయాత్రలో పాల్గొనేందుకు లక్షలాది భక్తులు తరలి వచ్చారు. భక్తుల జయజయ ధ్వనాల మధ్య పూరీలోని జగన్నాథ ఆలయ ప్రాంగణం దద్దరిల్లింది. పూరీ వీధులు అన్నీ జనసంధ్రంగా మారాయి.

దేశవ్యాప్తంగా జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆయా ప్రాంతాలలో భారీగా భక్తులు చేరుకొని రథయాత్రను వీక్షిస్తున్నారు. విదేశీ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. జగన్నాథుని రథాన్ని లాగుతున్న భక్తులు పులకించిపోతున్నారు.

పూరీతో పాటు అహ్మదాబాద్, కోల్‌కతా తదితర నగరాలు సైతం పూరీ జగన్నాథ రథయాత్ర మూడ్‌లోకి వెళ్లాయి. గుజరాత్‌లో ఈ రోజు జగన్నాథ రథయాత్ర వైభవంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సంప్రదాయం ప్రకారం బంగారు చీపురుతో జగన్నాథ, బలరామ, సుభద్రా దేవి రథాలను శుభ్రం చేసి యాత్రను ప్రారంభించారు.

రథయాత్రను ప్రారంభించిన అనంతరం మోడీ మాట్లాడారు. గుజరాత్ అభివృద్ధి పథంలో పయనించి అగ్రగామి రాష్ట్రంగా నిలువాలని జగన్నాథుని ప్రార్థిస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రజలు ఐక్యమత్యంగా సద్భావనతో మెలగాలని మోడీ ఆకాంక్షించారు. కలూపూర్, ప్రేమదర్వాజ, ఢిల్లీ చక్లా, దరియాపూర్, షాపూర్‌ల మీదుగా 14 కిలోమీటర్లు ఈ యాత్ర సాగుతుంది.

అహ్మదాబాదులో

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బుధవారం అహ్మాదాబాదులో రథయాత్రను ప్రారంభించారు. సంప్రదాయం ప్రకారం బంగారు చీపురుతో జగన్నాథ, బలరామ, సుభద్ర దేవి రథాలను శుభ్రం చేశారు.

మోటాల్ సైకిల్ స్టంట్

ఓల్డ్ రథయాత్ర వేడుకల ప్రాక్టీస్‌లో భాగంగా ఓ యువకుడు మోటార్ బైకర్ స్టంట్

తాడు బాగుంది!

జగన్నాథ రథయాత్ర కోసం సిద్ధంగా ఉన్న తాడు. దానిని పరిశీలిస్తున్న ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్

 136వ సంవత్సర రథయాత్ర

అహ్మదాబాదులో 136వ సంవత్సర రథయాత్ర నేపథ్యంలో భక్తులు కలశాలని నెత్తి పైన పెట్టుకొని కలశ యాత్ర చేస్తున్న దృశ్యం

విదేశీ భక్తులు

దిబ్రగర్‌లో ఇస్కాన్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రథయాత్రలో పాల్గొన్న విదేశీ భక్తులు

కోయంబత్తూరులో

జగన్నాథ రథయాత్ర సందర్భంగా బుధవారం కోయంబత్తూరులోని కొనియమ్మన్ ఆలయానికి వచ్చిన భక్తులు.

ఒరిస్సాలో

ఒరిస్సాలోని పూరీలో జరిగే జగన్నాథ రథయాత్ర వైభవంగా ప్రారంభమైంది.

English summary
It is an entire new mood in the cities of Ahmedabad, Kolkata and Dibrugarh; it is Rath Yatra after all! The entire state of Orissa, however, stands apart from the entire nation this day as people throng the religious town of Puri to catch a glimpse of the giant chariot and their favourite deity Jagannath.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X