వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైద్రాబాద్ లింక్స్‌పై దర్యాఫ్తు: గయ పేలుళ్లపై షిండే

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే బుధవారం తెలంగాణ అంశం, బుద్దగయ పేలుళ్లు, ఇష్రత్ జహాన్ తదితర అంశాల పైన స్పందించారు. ఆయన ఈ రోజు బుద్దగయ పేలుళ్లపై సమీక్ష నిర్వహించారు. బుద్దగయ పేలుళ్లపై దర్యాఫ్తు కొనసాగుతోందన్నారు. ఈ పేలుళ్లలో ముగ్గురు నలుగురు ఇవ్వాల్వ్ అయి ఉన్నారని చెప్పారు.

జాతీయ దర్యాఫ్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాఫ్తు చేస్తోందని చెప్పారు. బుద్దగయ పేలుళ్లకు హైదరాబాదు లింకుల పైన విచారణ జరుపుతున్నారని, అప్పుడు అన్నీ తెలుస్తాయన్నారు. ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ పైన కూడా దర్యాఫ్తు కొనసాగుతుందని చెప్పారు.

Sushil kumar Shinde

తెలంగాణపై..

తెలంగాణ అంశం పైన చర్చలు కొనసాగుతున్నాయని షిండే చెప్పారు. తెలంగాణను తానొక్కడినే నిర్ణయించలేను కదా అన్నారు. తెలంగాణ సమస్యను త్వరగా తేల్చేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేస్తోందన్నారు. దీనిపై ఇరు ప్రాంతాల నేతలతో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు.

కుటుంబ పెద్ద బాధ్యత: బొత్స

సమైక్య, విభజనకు సంబంధఇంచి అధిష్టానం నివేదిక కోరిందని, నివేదిక కోసం కసరత్తు జరుగుతోందని, అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నానని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ హైదరాబాదులో చెప్పారు. అధిష్టానం నిర్ణయానికి కాంగ్రెసు పార్టీ నేతలు అందరూ కట్టుబడి ఉండాలన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ బొత్సను శైలజానాథ్ కలిశారు. సాయంత్రం సీమాంధ్ర, తెలంగాణ నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలువనున్నారు.

English summary
NIA started its probe into the serial blasts in this temple town, Union home minister SushilkumarShinde on Wednesday did not rule out the involvement of three to four persons in the attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X