వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీటు కోసం జగన్‌పై విషం కక్కాడు: ఉండవల్లిపై గోనె

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gone Prakash Rao
హైదరాబాద్: రాజ్యసభ సీటు కోసమే కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విషం కక్కారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గోనె ప్రకాశ రావు గురువారం మండిపడ్డారు. రాజమండ్రి సభలో ఉండవల్లి చెప్పినవన్నీ అబద్దాలే అన్నారు. సభలో ఎంపీగా తానేం చేశానో చెప్పకుండా ఇతర విషయాలు మాట్లాడటం విడ్డూరమన్నారు.

ఎంపీగా ఏం చేశానో చెబుతానని సభ పెట్టి జగన్ పైన ఆరోపణలు చేశారన్నారు. జగన్ పైన ఆయనకు ఉన్న అక్కసునంతా సభలో చెప్పారన్నారు. కార్పోరేటర్‌గా కూడ ఎన్నిక కాలేని అతనిని దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా చేశారన్నారు. సీటు ప్రాపకం కోసమే జగన్‌ను టార్గెట్ చేశారన్నారు. జగన్ పైన విమర్శలు చేయడం ద్వారా వచ్చేసారి రాజ్యసభ సీటు దక్కించుకోవాలని చూస్తున్నారన్నారు.

తెలంగాణ విషయంలోను ఆయన అన్నీ అబద్దాలే చెప్పారన్నారు. రాజ్యాంగం తెలుసని చెబుతున్న ఉండవల్లి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారన్నారు. విభజనకు తీర్మానం అవసరం లేదని తెలుసుకోవాలన్నారు. 294 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా రాష్ట్రం ఏర్పాటు చేసే అధికారం కేంద్రానికి ఉందన్నారు.

సోనియాపై నాగం నిప్పులు

కాంగ్రెసు కోర్ కమిటీలో తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని భారతీయ జనతా పార్టీ నేత, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో ఆత్మబలిదానాలకు ఎ1 నిందితురాలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీయే అన్నారు. సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమాలను కాంగ్రెసు పార్టీయే ప్రోత్సహిస్తోందన్నారు. కాంగ్రెసు తెలంగాణ ఇవ్వకుంటే నరేంద్ర మోడీ ఇస్తారన్నారు. 2014 సెప్టెంబర్ 15 నుంచి తెలంగాణ సెక్రటరియేట్ నడుస్తుందన్నారు.

English summary
YSR Congress Party leader Gone Prakash Rao said on Thursday that Rajahmundry MP UNdavalli Arun Kumar allegations against YS Jaganmohan Reddy for Rajya Sabha seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X