వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిక్చర్స్: వర్షాకాలం వచ్చేసింది, భారత్‌లో వానలు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పంజాబ్, హర్యానా, చండీఘర్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో, సిక్కింలో వర్షాలు పడుతున్నాయి. తూర్పు రాజస్థాన్, మరఠ్వాడా, తెలంగాణ, కేరళలలో కూడా రుతు పవనాల ప్రభావం కనిపిస్తోంది.

పశ్చిమ తీర ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్, అస్సాం, మేఘాలయ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మధ్య మహారాష్ట్ర, లక్షద్వీప్‌ల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, జల్లులు పడ్డాయి.

అస్సాం, మేఘాలయ, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, కొంకణ్, గోవా, కోస్తా కర్ణాటక, కేరళ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో వచ్చే 72 గంటల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేస్, గుజరాత్, విదర్భ, చత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల్లోని ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

ముంబైలో..

వర్షాలతో ముంబై తడిసి ముద్దయింది. బుధవారం ఇళ్లకు చేరుకోవడానికి ముంబై ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు.

గుర్గావ్‌లో ఇలా..

గుర్గావ్‌లో బుధవారం భారీ వర్షం కురిసింది. దీని ప్రభావంతో ఢిల్లీ - గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ వే నీటితో నిండిపోయింది. హీరో హోండా చౌక్ వద్ద నీటిలో ఓ కారు ఇలా...

న్యూఢిల్లీలో పరిస్థితి..

ఢిల్లీలో బుధవారం వర్షాలు కురిశాయి. ఇండియా గేట్ వద్ద వానల నుంచి రక్షించుకోవడానికి కార్మికులు ప్లాస్టిక్ షీట్లను కప్పుకుని ఇలా..

వాన తిప్పలు ఢిల్లీలో ఇలా..

మంగళవారం కూడా ఢిల్లీలో వర్షం పడింది. వర్షం తర్వాత రిక్షావాలాలు ఇలా ఇబ్బందులు పడుతూ..

దేశ రాజధానిలో రోడ్లపై నీటి ప్రవాహం

మంగళవారం ఢిల్లీలో వర్షం కురిసింది. దీంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద నీరు నిండిపోవడంతో భారంగా కదులుతున్న వాహనాలు...

జమ్మూలో ఇలా..

మంగళవారం జమ్మూలో వర్షం తెరిపి ఇవ్వలేదు. కొంత మంది పిల్లలు ప్లాస్టిక్ షీట్స్ కప్పుకుని వానలో నడుస్తూ..

English summary
Southwest monsoon are active over Punjab, Haryana, Chandigarh and Delhi, the Sub­-Himalayan West Bengal and Sikkim. East Rajasthan, Marathawada, Telangana and Kerala are some of the other regions that witness active southwest monsoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X