వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాఘవ్: తాను ప్రారంభించిన జైలు గదిలోనే బందీ

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా అనేది రాఘవ్‌జీకి వర్తిస్తుంది. తన వద్ద పని చేస్తున్న వ్యక్తితో స్వలింగ సంపర్కానికి పాల్పడినట్టు అరోపణలు ఎదుర్కొన్న మధ్యప్రదేశ్ మాజీ ఆర్థిక మంత్రి రాఘవ్‌జీ బోపాల్ సెంట్రల్ జైలు గదిలో పెట్టారు. ఏడేళ్ళ క్రితం ఆర్థిక శాఖామంత్రిగా తన చేతుల మీదుగా ప్రారంభించిన జైలు గదిలోనే ఆయన ఇపుడు ఊచలు లెక్కిస్తున్నారు.

Raghav was kept in the jail, which was inaugurated by him

అసహజరతి ఆరోపణల్లో భోపాల్‌లోని తన ఫ్లాట్‌లో దాక్కున్న రాఘవ్‌జీని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. వెంటనే కోర్టులో హాజరుపరిచి సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ 2006 జులై నెలలో ఆయన చేతుల మీదుగా రిబ్బన్ కత్తిరించి ప్రారంభించిన చేసిన జైలు గదినే ఆయనకు కేటాయించారు. భోపాల్ సెంట్రల్ జైలులోని బి బ్లాకులో ఉన్న పదో నంబర్ బరాక్‌లో ఈయనను ఉంచినట్టు జైలు అధికారులు వెల్లడించారు. ఈ గదిని విచారణ ఖైదీలకు కేటాయిస్తుంటారు. ఈ బ్లాకు రెండు భాగాలుగా ఉంది. మొదటి భాగాన్ని 2006లో ప్రారంభించారు. అందులో మొత్తం 12 బరాక్‌లున్నాయి.

తన పని మనిషి రాజ్‌కుమార్ డంగిని రాఘవ్‌తో పాటు అతని ఇద్దరు ఇనుచరులు లైంగిక వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. తొమ్మిదేళ్లుగా ఆ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన రాఘవ్ రాజీనామా చేశారు. పని మనిషిని లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పని మనిషి అతని పైన కేసు పెట్టాడు.

రాఘవ్ భార్య, బంధవులు వివేక్‌లతో కలిసి ఫ్లాట్‌లోనే ఉన్నాడు. పోలీసులు లోనికి ప్రవేశించి ఆయనను తీసుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు ఆయనను భోపాల్ కోర్టులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కోర్టు ఆయనకు ఈ నెల 22వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.

English summary

 Raghavji has been kept in a jail room, which was inaugurated by him. 80-year-old Raghavji had locked himself in a flat located at Rashi Prabha Apartment in Bhopal. Police arrested the former minister and BJP leader in connection with the sex scandal which rocked Madhya Pradesh government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X