వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేడెక్కిన తెలంగాణ: నేడు విద్యాసంస్థల బంద్‌కు పిలుపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana Bandh
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెసు కోర్ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి శనివారం విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. తీపి కబురు వింటారని భేటీలో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ తనను కలిసినప్పుడు ఒయు జెఎసి నేతలకు చెప్పారు. దీంతో నిర్ణయం వెలువుడతుందని ఆశించిన ఓయు జెఎసి నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో రేపు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు.

కోర్ కమిటీ వాయిదాల కమిటీగా మారిందని తెలంగాణ జెఎసి వ్యాఖ్యానించింది. ఎవరి దయతోనూ తెలంగాణ రాదని, మన బలంతోనే తెలంగాణ సాధ్యమని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. సంఘటితంగా పోరాడి తెలంగాణ సాధించుకుంటామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు సాచివేత వైఖరి గర్ఙనీయమని ఆయన అన్నారు. ఈ నెల 16 లేదా 17వ తేదీ నుంచి ఉధృతంగా జనచైతన్యయాత్రలు చేపడుతామని ఆయన అన్నారు.

కాంగ్రెసు కోర్ కమిటీ నాటకం మరోసారి బయటపడిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్సించింది. తెలంగాణ అంశంపై నిర్వహించిన కాంగ్రెసు కోర్ కమిటీ వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఆ పార్టీ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్, గట్టురామచంద్రరావు అన్నారు. ఇలాంటి మోసం జరుగుతుందని ముందే ఊహించామని వారన్నారు. కాంగ్రెసు కోర్ కమిటీ కాదని, అది చోర్ కమిటీ అని వారు వ్యాఖ్యానించారు.

కాంగ్రెసు కోర్ కమిటీ తెలంగాణపై తేల్చకపోవడాన్ని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు తప్పు పట్టారు. కాంగ్రెసు తెలంగాణపై తేల్చకుండా తమ వైఖరిని అడిగిందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు మోసపూరిత వైఖరి మరోసారి బయటపడిందని ఆయన అన్నారు.

English summary
Osmania University JAC has given call to eductaional institutions bandh tommorrow protesting against Congress high command indecissive attitude towards Telangana issue. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X