వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భేటీ ప్రారంభం, ధర్నా: ఓయు, సమైక్య విద్యార్థుల అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

OU and Seemandhra JAC leaders arrest
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై చర్చించేందుకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు కోర్ కమిటీ భేటీ అయింది. ఈ సమయంలో ప్రధాని నివాసం ముందు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్యకార్యాచరణ సమితి, సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి నేతలు ఆందోళనకు దిగారు.

తెలంగాణకు, సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. విభజించాలని ఓయు నేతలు, విభజించవద్దంటూ సీమాంధ్ర విద్యార్థి నేతలు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. వారిని తరలించే సమయంలో విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

తెలంగాణ అంశంపై చర్చించేందుకు ప్రధాని నివాసంలో కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, కేంద్రమంత్రులు సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, ఎకె ఆంటోనీ, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ హాజరయ్యారు. అమెరికా పర్యటనలో ఉన్న చిదంబరం కోర్ కమిటీకి దూరంగా ఉన్నారు.

రాష్ట్రం నుండి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు పాల్గొన్నారు. వీరు కోర్ కమిటీ భేటీలో తమ తమ రోడ్ మ్యాపును అధిష్టానానికి అందించనున్నారు. నేతలు ప్రజెంటేషన్ ఇస్తారు.

English summary
Osmania University Students JAC leaders and Samaikyandhra Vidyarthi JAC leaders were arrested by the New Delhi police on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X