ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాసలోకి టిడిపి రెబెల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి

By Pratap
|
Google Oneindia TeluguNews

Samudrala Venugopala chari
ఆదిలాబాద్: తెలుగుదేశం తిరుగుబాటు శాసనసభ్యుడు సముద్రాల వేణుగోపాలాచారి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ శాసనసభ్యుడైన వేణుగోపాలాచారి ఈనెల 14వ తేదీన తెరాసలో చేరుతారు. ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో తెరాస అధినేత కె. చంద్రశేఖర రావు సమక్షంలో ఆ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

1985 నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న వేణుగోపాలచారి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇటీవల తెలంగాణపై తెలుగుదేశం పార్టీ వైఖరిని ఆయన ప్రశ్నించారు. దీంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. తెరాస ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్ ధిక్కరించారంటూ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఆయనపై తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. వేణుగోపాలాచారిపై వేటు వేయాలని కోరింది.

ప్రస్తుతం ఎమ్మెల్యే వేణుగోపాలచారి అనర్హత వేటు విషయాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ పెండింగ్‌లో ఉంచారు. తెలుగుదేశం పార్టీకి దూరమైన వేణుగోపాలచారి నాగం జనార్దన్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ నగారా సమితితో పనిచేస్తూ వస్తున్నారు. ఇటీవల నాగం జనార్దన్‌రెడ్డి నగారాను బీజేపీలో విలీనం చేయడంతో వేణుగోపాలచారి ఒంటరిగా మారారు.

తెలంగాణ వాదిగా మొదటి నుంచి పేరున్న చారికి కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగా వేణుగోపాలచారి తెరాసలో చేరేందుకు మార్గం సుగమమైంది.

English summary

 The Telugudesam party rebel MLA Samudrala Venugopala chari has decided to join in K Chandrasekhar Rao's Telangana Rastra Samithi (TRS).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X