చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయకాంత్ పైన హత్యాయత్నం కేసు, వేధిస్తున్నారని..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijayakanth
చెన్నై: డిఎండికె అధ్యక్షుడు, శాసన సభ్యుడు విజయకాంత్ పైన హత్యాయత్నం కేసుతో సహా నాలుగు కేసులు నమోదయ్యాయి. కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లో గత ఏడాది పార్టీ తరపున ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయకాంత్ ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలితపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపిస్తూ నాగర్‌కోయిల్ కోర్టులో గతంలో పిటిషన్ దాఖలైంది.

ఈ కేసు విచారణకు సంబంధించి గత 1న విజయ్‌కాంత్ నాగర్‌కోయిల్ కోర్టుకు హాజరైన నేపథ్యంలో అన్నాడిఎంకె న్యాయవాదులు, డిఎండికె న్యాయవాదుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వివాదం ముదిరి తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.

ఈ వ్యవహారానికి సంబంధించి గురువారం కోట్టార్ పోలీసులు విజయ్‌కాంత్‌తో సహా నలుగురిపై 341 (విధుల నిర్వహణను అడ్డుకోవడం), 307( హత్యాయత్నం), 506(2) (హత్యా బెదిరింపు) , 352 (ప్రభుత్వ అధికారుల విధులకు భంగం వాటిల్లజేయడం) లాంటి సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

అదే విధంగా డిఎండికె వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్నాడిఎంకె వర్గాలపై కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఇది ఇలా ఉండగా విజయకాంత్ పార్టీ నుంచి పాలక అన్నాడిఎంకెలోకి ఫిరాయించిన ఆరుగురు శాసన సభ్యులు గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ని కలిసి, విజయకాంత్ తమను వేధిస్తున్నాడనీ, రాజ్యసభ ఎన్నికల్లో తమ ఓటింగును ప్రశ్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

English summary
Police filed case against DMDK chief Vijayakanth and 5 others under 4 sections including attempt to murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X