• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వారిద్దరిని జైలుకు పంపాల్సిందే: సిబిఐ వాదన

By Pratap
|

Sabitha and Dharmana
హైదరాబాద్: మీడియాతో మాట్లాడిన విషయాలపై దాఖలు చేసిన మెమోపై మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి వ్యక్తం చేసిన అభ్యంతరాలను సిబిఐ వ్యతిరేకించింది. వారిద్దరు మంత్రులుగా పనిచేశారని, రాజకీయంగా పలుకుబడి కలిగినవారని, అధికార వర్గాల్లో ప్రాబల్యం ఉందని, ఈ నేపథ్యంలో వారు మాట్లాడిన మాటలు సాక్షుల్ని ప్రభావితం చేస్తాయని సిబిఐ వాదించింది. సిబిఐ స్పెషల్ పీపీ సురేందర్ నాంపల్లి సీబీఐ కోర్టులో వాదనలు వినిపించారు.

వాన్‌పిక్ భూముల కేటాయింపులో అధికారులు, మంత్రులు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఈ కేసులోనే ధర్మానపై అభియోగాలు మోపామని చెప్పారు. అలాగే దాల్మియా సిమెంటు కంపెనీకి కడప జిల్లాలో 470 హెక్టార్ల సున్నపు రాతి నిక్షేపాల కేటాయింపు మొత్తం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, ఒక కంపెనీ కోసం లీజులు తీసుకుని మరొక కంపెనీకి వాటి హక్కులను బదలాయించారని, ఈ వ్యవహారంలో సబితను నిందితురాలిగా చేర్చామని చెప్పారు.

కొంత మంది నేతలు తమవారి తప్పేమీ లేదని కూడా వ్యాఖ్యానిస్తున్నారని, ఈ నేపథ్యంలో ధర్మాన, సబిత తాము నిర్దోషులుగా బయటకు వస్తామనడం వల్ల సాక్షులు ప్రభావితమవుతారని అన్నారు. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోరారు.

ఇదిలావుంటే, రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కుల్లో భావ ప్రకటన స్వేచ్ఛ ఒకటని, మాట్లాడటమే తప్పంటూ సిబిఐ వేసిన మెమో దానిని ఉల్లంఘించడమేనని మాజీ మంత్రులు ధర్మాన, సబిత అన్నారు. తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని, డిశ్చార్జి పిటిషన్‌లో కోర్టుకు నివేదించే అంశాలనే తాము మీడియాతో చెప్పామని, అది ఎంత మాత్రం తప్పు కాదని వారన్నారు.

జ్యుడీషియల్ కస్టడీకి తమను పంపాలని సీబీఐ గత నెల 7న దాఖలు చేసిన మెమోపై నాంపల్లి సిబిఐ కోర్టులో ధర్మాన, సబిత వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. సిబిఐ తీరును ఇరువురూ ఆక్షేపించారు. సిబిఐ దాఖలు చేసిన మెమోను కొట్టేయాలని కోర్టును కోరారు. ప్రజాప్రతినిధులుగా తాము ఎందుకు రాజీనామా చేశామో చెప్పాల్సిన బాధ్యత త మపై ఉందని అందుకే మీడియాతో మాట్లాడామని చెప్పారు. దీనిపై వాదనలను కోర్టు 19వ తేదీకి వాయిదా వేసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
CBI has opposed ex ministers sabitha Indra Reddy and Dharmana Prasad Rao objections raised against its memo filed in CBI court seeking judicial custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more