• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్టార్ బ్యాట్స్‌మన్‌ను డకౌట్ చేస్తాం: లగడపాటికి మంద

By Srinivas
|

Manda Jagannadham
నల్గొండ/హైదరాబాద్: తమకు ఓ స్టార్ బ్యాట్సుమన్ ఉన్నాడన్న విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యలకు పార్లమెంటు సభ్యుడు మంద జగన్నాథం కౌంటర్ ఇచ్చారు. ఆయన ఆదివారం నల్గొండ జిల్లాలో మాట్లాడారు. లగడపాటి చెప్పిన ఆ స్టార్ బ్యాట్స్‌మన్‌ను డకౌట్ చేస్తామని మంద వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌ రెడ్డిని ఉద్దేశించి తమకు స్టార్ బ్యాట్స్‌మన్ ఉన్నారంటూ లగడపాటి పరోక్షంగా చెప్పారు.

పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను మళ్లీ మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పన్నాగం పన్నిందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పంచాయతీ ఎన్నికల ముందే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మాట నిలుపుకోవాలన్నారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీ 15-16 పార్లమెంట్ సీట్లు గెలుస్తుందని, అప్పుడు ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.

ఎవరు ఆపలేరు: కోదండ

హరిహరాదులు అడ్డొచ్చినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాం అన్నారు. ఇచ్చిన మాట ప్రభుత్వం నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేయడం తగదన్నారు. అటో ఇటో ఏదో ఒకటి తేలుస్తామంటున్నారని, తెలంగాణకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని కోదండరామ్ డిమాండ్ చేశారు.

పట్టణాలు, గ్రామాల్లో సాంస్కృతిక యాత్ర కొనసాగిస్తామని తెలిపారు. తీర్మానాలు చేసిన పత్రాల మీద బస్టాండ్‌లు, కళాశాలలు, రహదారులు, కూడళ్ల వద్ద ప్రజలతో సంతకాలు చేయిస్తామని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత పునర్ నిర్మాణం జరగాల్సిన అవశ్యకత ఉన్నదని, అందుకు ఈ రెండు రోజుల మేధోమధనంతో స్పష్టత వచ్చిందన్నారు. అధ్యయనం, కార్యాచరణ, అనుభవం, ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి కొనసాగుతాయన్నారు.

English summary
MP Manda Jagannatham has responded on Vijayawada MP Lagadapati Rajagopal's Star Batsman comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X