వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూటల నిండా డబ్బు: యాచకురాలి వద్ద రూ.2 లక్షలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lakhpati beggar
బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలో ఓ యాచకురాలి వద్ద భారీగా నగదును గుర్తించారు. దావణగెరె ప్రాంతంలో ఉంటున్న కాలమ్మ అనే యాచకురాలి నుండి పోలీసులు దాదాపు రెండు లక్షలకు పైగా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. భిక్షగాళ్ల వద్ద పెద్ద మొత్తంలో డబ్బుందని తెలిస్తే ఎవరికైనా కమల్ హాసన్ 'పుష్పక విమానం' సినిమా గుర్తుకు వస్తుంది!

ఇప్పుడు కర్నాటకలో ఓ వృద్ధ మహిళ వద్ద రెండు లక్షల రూపాయలకు పైగా పోలీసులు గుర్తించారు. యాచకురాలు కాలమ్మ దావణగెరె ప్రాంతంలో చెత్తకుప్పలోనే పడుకుంటోంది. ఆమె వద్ద ఎప్పుడూ మూడా నాలుగు పెద్ద మూటలు ఉంటాయి. చెత్తను తొలగించే ఉద్దేశ్యంలో భాగంగా మున్సిఫల్ అధికారులు ఆమె పడుకునే ప్రాంతంలో ఉన్న మూటలను తొలగించాలనుకున్నారు.

అవి చాలా బరువు ఉండటంతో తెరిచి చూశారు. అందులో నగదు, నోట్లు ఉన్నాయి. వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమెను విచారించారు. తాను కష్టపడి సంపాదించుకున్న డబ్బేనని, అడుక్కోగా వచ్చిన డబ్బు అని చెప్పింది.

అర్ధరూపాయి, రూపాయి, నోట్లు పావలాలు అన్నీ ఉండటంతో ఆమె అడుక్కోగా వచ్చిన డబ్బేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆ నగదు మొత్తాన్ని పోలీసులు ఆమె పేరిటే బ్యాంకులో వేశారు. ఆమెను ఓ వృద్ధాశ్రమంలో చేర్పించారు.

English summary
Cops and Municipal Officers had found Rs 2 lakh with a woman beggar in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X