హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పార్టీలో అసంతృప్తి: జనార్ధన్ స్థానంలో కూన శ్రీశైలం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kuna Srisailam Goud
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అసంతృప్తి జ్వాలలు బయటపడుతున్నాయి. పార్టీ అధిష్టానం పైన పలుమార్లు పలువురు తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా రంగారెడ్డి జిల్లా కన్వీనర్ జనార్ధన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసేందుకు సన్నద్ధమైన పరిస్థితుల్లో ఆయనను ఆ పదవి నుండి తప్పించి పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలిలో సభ్యుడిగా నియమించనున్నట్లు ప్రకటించింది.

జనార్ధన్ రెడ్డి స్థానంలో కుత్బుల్లాపూర్ శాసన సభ్యుడు కూన శ్రీశైలం గౌడ్‌ను నియమించింది. పార్టీలో మొదటి నుండి పని చేస్తున్న వారిని గుర్తించడం లేదని జనార్ధన్ రెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారట. ఈ విషయాన్ని ఆయన పెద్దల దృష్టికి కూడా తీసుకు వెళ్లారట. ఫలితం కనిపించక పోవడంతో రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు.

దీనిని గుర్తించిన అదిష్టానం ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఆయనను జిల్లా కన్వీనర్ పదవి నుంచి తప్పించి ఆన స్థానంలో శ్రీశైలం గౌడ్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. అసంతృప్తి నేపథ్యంలో ఈ మార్పు ఆకస్మికంగా జరిగిందంటున్నారు. అదే సమయంలో ఆయనను సిఈసిలోకి తీసుకున్నారు. సిఈసి పట్ల కూడా జనార్దన్ అంత సంతృప్తిగా లేరని అంటున్నారు.

కాగా జిల్లా కన్వీనర్‌గా తనకు కనీసం గుర్తింపునివ్వడం లేదని, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పని చేసిన వారికి ప్రోత్సాహం ఇవ్వడం లేదని, కనీస అవహాగన లేని, స్థాయిలోని వారినీ నియోజకవర్గాల సమన్వయకర్తలుగా నియమించారని జనార్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

English summary

 YSR Congress Party High Command replaced Janardhan Reddy as district convenor by MLA Kuna Srisailam Goud.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X