వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన అడ్డుకునేందుకు ఏ ఆటకైనా రెడీ: మల్లాది విష్ణు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Malladi Vishnu
హైదరాబాద్/విజయవాడ: దివంగత ప్రధానమంత్రి ఇందిర గాంధీ అడుగుజాడల్లో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నడుస్తారని కాంగ్రెసు పార్టీ కృష్ణా జిల్లా శాసన సభ్యుడు మల్లాది విష్ణు మంగళవారం అన్నారు. విభజనను అడ్డుకునేందుకు తాము ఏ ఆటకైనా సిద్ధమన్నారు. విభజన విషయంలో అసెంబ్లీలో తీర్మానం కోరుతామన్నారు. తీర్మానం సమయంలో జరిగే చర్చలో రాష్ట్ర ప్రజలకు తాము వాస్తవాలను తెలియజేస్తామని ఆయన తెలిపారు.

సమైక్యవాదినే: పనబాక

తాను సమైక్యవాదినని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి వేరుగా అన్నారు. తెలంగాణ విషయంలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా అధిష్టానం నిర్ణయం ఉంటుందన్నారు. తాను సమైక్యవాదినే అయినప్పటికీ, తమ పార్టీ పెద్దల నిర్ణయమే ఫైనల్ అన్నారు. వారి నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానన్నారు. తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండామని హైదరాబాదుకు చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్‌లు చెప్పారు.

సింపుల్ మెజార్టీ చాలు: వెంకయ్య

పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ కావడానికి సింపుల్ మెజార్టీ చాలని భారతీయ జనతా పార్టీ నేత వెంకయ్య నాయుడు అన్నారు. బిజెపి అప్పుడు రాజ్యాంగ సవరణ లేకుండా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని, 2014లో అధికారంలోకి వస్తే తెలంగాణను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే రాయల తెలంగాణ ప్రస్తావన తెస్తున్నారని ఆరోపించారు.

విడిపోతే..: సోమిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ విడిపోతే మరో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలుగా మారుతుందని తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్నారు. విభజన పైన అన్ని పార్టీలతో పునఃసమీక్షించుకొని, తెలుగు వారికి ప్రయోజనం కలిగే మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు.

English summary
Krishna district MLA Malladi Vishnu said that Seeamdhra mlas will demand for resolution over Telangana in next sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X