వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొంటారా?: టివి9 ఛానల్స్ పైన సన్ నెట్ వర్క్ కన్ను!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sun TV Network Ltd
న్యూఢిల్లీ: ఒక ఆంగ్ల ఛానల్ సహా ఆరు ప్రాంతీయ ఛానల్స్‌ను నిర్వహిస్తున్న అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెండ్(ఎబిసిఎల్) వారి టివి9 గ్రూపు ఛానల్స్‌ను సన్ నెట్ వర్క్ సొంతం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా బిజినెస్ లైన్ మంగళవారం ఓ వార్తను వెలువరించింది.

టివి9 గ్రూప్ ఛానల్స్‌లో తెలుగు, కన్నడ, గుజరాతి, మరాఠీ ఛానల్స్‌తో పాటు ఒక ఇంగ్లీష్ ఛానల్ ఉంది. తెలుగులో టివి9తో పాటు టివి 1 కూడా ఉంది. వీటిని కొనుగోలు చేసే ప్రయత్నాల్లో కళానిధి మారన్‌కు చెందిన సన్ టివి ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ ఒప్పందం విలువ సుమారు రూ.150 కోట్లు ఉండవచ్చునని బిజినెస్ లైన్ పేర్కొంది.

టివి9కు ఆంధ్రప్రదేశ్, కర్నాటకలలో మంచి మార్కెట్ ఉంది. సన్ నెట్ వర్క్ దక్షిణాదిన 16వేల కోట్ల మార్కెట్ కలిగి ఉంది. మొత్తం 32 ఛానల్స్ కలిగి ఉంది. తమిళ్‌లో సన్ నెట్ వర్క్ మార్కెట్ అధికం. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళలోను మంచి మార్కెట్టే ఉంది.

ఇప్పటికే దక్షిణాదిన అగ్రస్థానంలో ఉన్న సన్ నెట్ వర్క్... ఎపి, కర్నాటకల్లో అగ్ర స్థానంలో ఉన్న టివి9ను కొనడం ద్వారా దాని పరిధిని మరింత పెంచుకోనుందని అంటున్నారు. కాగా టివి9 విలువ దాదాపు రూ.500 కోట్లుగా అంచనా వేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ సన్ నెట్ వర్క్ రూ.150 కోట్లకు కొనే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు రావడం గమనార్హం.

టివి9 గ్రూపును దక్కించుకోవటం ద్వారా న్యూస్ విభాగంలోనూ ప్రాంతీయ చానల్స్‌లో సన్ నెట్ వర్క్ తనదైన ముద్ర వేసేందుకు వీలుకలుగుతుంది. కన్నడ, తెలుగు మార్కెట్లలో సన్ నెట్ వర్క్ వారి న్యూస్ చానల్స్ ఆఖరి స్థానంలో ఉండటం, తమిళనాడులో అసలు టివి9 లేకపోవటం సన్ నెట్ వర్క్‌కు అనుకూలంగా ఉంది. మరోవైపు టివి9 ఒప్పుకుందా? ఒప్పుకుంటే ఇంత తక్కువ ధరకు అంగీకరిస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు.

కాగా ప్రకటనల వ్యవధిని గంటకు 12 నిమిషాలకు పరిమితం చేస్తూ ట్రాయ్ తీసుకున్న నిర్ణయం అక్టోబర్ నుంచి అమలు కావలసి ఉండగా మార్కెట్ లీడర్‌గా ఉన్న ఛానల్స్ మాత్రమే అందుకు తగినట్టుగా టారిఫ్ పెంచుకోగలుగుతాయి. ఆ విధంగా టివి9 తన అనుకూలత కొనసాగుతున్న తరుణంలో అమ్ముకోవాల్సిన అవసరం లేదని, డిజిటలైజేషన్ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి పే ఛానల్స్‌గా మారటానికి అనుకూలంగా ఉన్న ఛానల్స్‌లో టివి9 ఛానల్స్ కూడా ఉన్నాయని అంటున్నారు.

యాజమాన్యం ఇంకా నిర్ణయం తీసుకోకపోయినా, న్యూస్ విభాగంలో వినియోగదారులు ఎంత మాత్రమూ వెనుకాడకుండా చందా కట్టే అవకాశాలున్న ఛానల్‌గా టివి9ను చెప్పుకోవచ్చునంటున్నారు. ఎపి, కర్నాటకల్లో అనూహ్య మార్కెట్ ఉన్న టివి9 రూ.150 కోట్లకు అమ్మడమనే వార్తల్లో అర్థం లేదనే వాదన కూడా వినిపిస్తోంది.

English summary
The Kalanithi Maran - Controlled sun TV Network Ltd is close to acquiring Hyderabad based ABCL, which manages a chain of regional news channels under the brand TV9.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X