వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'తెలంగాణ' బలాబలాలు ఎలా?: సోనియాతో స్పీకర్ భేటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi and Nadendla Manohar
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో సభాపతి నాదెండ్ల మనోహర్ గురువారం భేటీ అయ్యారు. దాదాపు ఇరవై అయిదు నిమిషాలు సమావేశమయ్యారు. వారి మధ్య తెలంగాణ విషయం ప్రధానంగా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై తీర్మానం జరుగుతుందనే ప్రచారం నేపథ్యంలో స్పీకర్ ఢిల్లీలో పలువురు పెద్దలను కలుస్తుండటం గమనార్హం. తీర్మానం పెడితే ఎవరి బలం ఎంత? ఏ పార్టీ అనుకూలం, ఏ పార్టీ వ్యతిరేకం, మద్దతిచ్చే వారెవరు? ఆయా పార్టీలలో ఎంత మేరకు అధిష్టానాన్ని ధిక్కరించే వైఖరి ఉంటుందని.. తదితర అంశాలు చర్చకు వస్తున్నట్లుగా చెబుతున్నారు.

బుధవారం రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌తో సమావేశమైన నాదెండ్ల తీర్మానం పెడితే ఏం జరుగుతుందనే నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ఆయన ఉదయం కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలుసుకున్నారు. ఆ తర్వాత సోనియా గాంధీతో అరగంట పాటు భేటీ అయ్యారు. తెలంగాణ, రాష్ట్ర తాజా పరిస్థితులపై వారు చర్చించారు.

రాజయ్య నివాసంలో టి నేతల భేటీ

తెలంగాణ కాంగ్రెసు పార్టీ నేతలు వరంగల్ పార్లమెంటు సభ్యుడు రాజయ్య నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణ కోసం వారు కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌ను కలుసుకోవాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ మాట్లాడుతూ.. ఆర్థిక ప్యాకేజీతో సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించలేరన్నారు. అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్న సమయంలో సీమాంధ్ర నేతలు తెరచాటా బాగోతాలు, దొంగచాటు రాజకీయాలు, వెన్నుపోటుతో అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, అది సరికాదని ఆరోపించారు.

పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, దయచేసి సీమాంధ్ర నేతలు ఎవరు అడ్డుకునే ప్రయత్నాలు చేయవద్దని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు.

తేలేది కాదు: ఆనం

తమ పార్టీ అధిష్టానం సమైక్యాంధ్రకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటుందని తాము భావిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇప్పుటికిప్పుడు తేలేది కాదన్నారు. రాష్ట్రం కలిసుంటేనే మంచిదని మరో మంత్రి కొండ్రు మురళీ మోహన్ అన్నారు.

English summary
Speaker Nadendla Manohar met AICC president Sonia Gandhi in New Delhi on Thursday. The two leaders discussed about Telanagana issue and present state situations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X