వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిఆర్పీ గతే జగన్‌కు, వైఎస్ బతికుంటే: మురళీ మోహన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

murali mohan
రాజమండ్రి/వరంగల్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రజారాజ్యం పార్టీ గతే పడుతుందని తెలుగుదేశం పార్టీ నేత, రాజమండ్రి ఇంఛార్జ్ మురళీ మోహన్ గురువారం అన్నారు. ఇందుకు పంచాయతీ ఎన్నికలే మంచి నిదర్శనమని అన్నారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే ఇప్పుడు చర్లపల్లి జైలులో ఉండేవారన్నారు. పంచాయతీ ఎన్నికలలో అధికార కాంగ్రెసు పార్టీ ప్రజలను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

విభజనపై తేల్చాలి

రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న విభజన సమస్యను తేల్చాలని మురళీ మోహన్ డిమాండ్ చేశారు. తెలంగాణ సమస్యను నాన్చడం సరికాదన్నారు.

తెలంగాణ అడ్డుకునేందుకే: గండ్ర

పంచాయతీ ఎన్నికలు ఏ పార్టీకి రెఫరెండం కాదని ప్రభుత్వ చీప్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి వరంగల్‌లో అన్నారు. వచ్చే తెలంగాణను అడ్డుకునేందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు కేంద్ర హోంశాఖ మంత్రి షిండేకు లేఖ రాశారన్నారు. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మవి దొంగ దీక్షలు అన్నారు. వారం రోజుల్లో జరిగే సిడబ్ల్యూసి సమావేశంలో తెలంగాణపై నిర్ణయం ఉంటుందన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు నక్సలిజం పెరుగుదలకు సంబంధం లేదన్నారు.

English summary
Telugudesam Party senior leader Murali Mohan alleged that YSR Congress Party will fail like Prajarajya Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X