వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మలాలా పాక్ రా!: తాలిబన్లు, ఛాందసవాదికి మరణ శిక్ష

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూసఫ్ జాయ్‌ని తిరిగి పాకిస్తాన్ వచ్చేయాల్సిందిగా తాలిబన్లు కోరారు. ఈ మేరకు తాలిబన్ ప్రతినిధి రషీద్ ఆమెకు లేఖ రాశారు. మలాలా వెనక్కి రావాల్సిందిగా కోరుతున్నానని, తన వూరికి వచ్చి చేరువలో ఉండే ఏదైనా ఆడపిల్లల మదర్సాలో చేరాలని, అల్లా గ్రంథాన్ని చదువుకోవాలని, ఇస్లాం.. ముస్లింల ఆవేదనను ప్రపంచానికి తెలియజేయడానికి తన కలం బలాన్ని ఉపయోగించాలని రషీద్ ఆ లేఖలో పేర్కొన్నారు.

ఆ లేఖలో రెండు వేలకు పైగా పదాలున్నాయి. దీనిని జూలై 15న పంపించారు. అయితే లేఖ ఎక్కడి నుండి వచ్చిందనేది తెలియరాలేదు. బుధవారం లేఖను మీడియాకు విడుదల చేశారు. అదే సమయంలో మలాలాపై దాడిని రషీద్ సమర్థించుకున్నాడు. తాలిబన్ వ్యతిరేక ప్రచారంలో మలాలా భాగస్వామి అయ్యారన్నాడు. మలాలా పాఠశాలకు వెళ్తోందని, చదువును ప్రేమిస్తోందని తాము దాడి చేయలేదని, చదువు కోవడాన్ని తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నాడు.

Malala

అయితే ఉద్దేశ్యపూర్వకంగా తాలిబన్లకు వ్యతిరేకంగా రాతలు రాస్తున్నట్లు విశ్వసించామని, స్వాత్‌లో ఇస్లామిక్ వ్యవస్థను ఏర్పాటు చేసే తమ ప్రయత్నాలను అపఖ్యాతి చేసే ప్రచారాలకు పాల్పడిందని, ఆ మాటలు, రాతలు తమను కవ్వించేలా ఉన్నాయన్నారు. ఐక్యరాజ్య సమితిలో మలాలా చేసిన ప్రసంగం శత్రువుల చేతిలో కీలుబొమ్మలా మారినట్లుగా ఉందన్నారు.

ఇస్లాం ఛాందసవాదికి మరణ శిక్ష

బంగ్లాదేశ్‌లో ఛాందసవాద జమాతే ఇస్లామీ పార్టీ అగ్రనేతకు ఉరిశిక్ష విధించారు. 1971లో యుద్ధం సందర్భంగా మేధావులను ఊచకోత కోసిన నేరాలపై విచారించన ట్రైబ్యునల్ జమాతే ప్రధాన కార్యదర్శి అలీ ఆషాం మహమ్మద్ మొజహీద్‌కు మరణ దండన విధించింది. కాగా రెండు రోజుల ముందు జామతే అధ్యక్షుడు ఆజాంకు 90 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

English summary
Days after Malala Yousufzai made a passionate appeal at the UN for the education of children, the Taliban on Wednesday asked the teenage activist to return to Pakistan and join a madrassa in the restive northwest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X