గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉల్లంఘన: వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anjaneyulu
గుంటూరు: గుంటూరు జిల్లా వినుకొండ శాసన సభ్యుడు వివి ఆంజనేయులు శుక్రవారం అరెస్టయ్యారు. ఎన్నికల నిబంధనను ఉల్లంఘించినందుకు ఆయనను అరెస్టు చేశారు. జిల్లాలోని గొల్లపల్లి మండలం మూగచింతలపాలెంలో ఆయన తన పుట్టిన రోజు సందర్భంగా ఓ కంటి వైద్య శిబిరంలో కళ్లద్దాలను పంపిణీ చేశారు. దీనిపై ఎమ్మెల్యే పైన కేసు నమోదుయిందని సమాచారం. దీంతో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఫిర్యాదు వచ్చిందని ఆయనను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారని సమాచారం.

తుని వద్ద కాల్పుల కలకలం

తూర్పు గోదావరి జిల్లా తుని జాతీయ రహదారి పైన ఉడిపి హోటల్ వద్ద పోలీసులు కాల్పులు జరిపారు. నలుగురు దొంగలను పట్టుకునే ప్రయత్నంలోనే పోలీసులు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది.

కూకట్‌పల్లి వద్ద కూలిన వృక్షం

గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాదులోని కెపిహెచ్‌బి వద్ద భారీ వృక్షం నేల కూలింది. ఐదు విద్యుత్ స్తంభాలు కూడా కూలిపడిపోవడంతో రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి.

ముఖ్యమంత్రి సమీక్ష

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం 108 సిబ్బంది సమ్మె పైన సమీక్ష అధికారులతో సమీక్ష నిర్వహించారు. 108 సేవలకు అంతరాయం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి వరదలు పోటెత్తుతుండటంతో వాటి పైన సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

English summary
Guntur district Vinukonda MLA Anjaneyulu was arrested by Guntur district police on Friday for code violation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X