కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సర్పంచ్ ఎన్నికలు: వైయస్ జగన్ పార్టీ అభ్యర్థి హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

YSR Congress
కడప: కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 10వ వార్డులో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న పెద్దరెడ్డెయ్యరాజు (55) అలియాస్ పులిరాజు గురువారం తెల్లవారుజామున హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించి పులిరాజు ప్రత్యర్థి గంగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎల్ఐసి గంగరాజు అదే వార్డులో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్నాడు. ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హా ఆదేశాలతో పులివెందుల డిఎస్పీ హరినాథబాబు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు దర్యాప్తు చేపట్టారు. హతుని కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం ఈ పంచాయతీ తొలి నుంచి మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్‌కుమార్‌రెడ్డి వర్గానికి అనుకూలంగా ఉంది.

10వ వార్డులో రమేష్‌రెడ్డి వర్గానికి చెందిన ఎల్‌ఐసి గంగరాజు కాంగ్రెస్ మద్దతుదారునిగా నామినేషన్ దాఖలు చేశారు. గత రెండు రోజుల నుంచి నాగరాజు తన ప్రత్యర్థి పులిరాజును పోటీ నుంచి తప్పుకోవాలని అన్ని రకాలుగా ఒత్తిడి చేశాడు. గంగరాజు వ్యూహం ఫలించకపోవడంతో గురువారం రాత్రి పులిరాజుతో మద్యం తాగించారు.

గొంతునులిమి లక్కిరెడ్డిపల్లె నడిబొడ్డున ఉన్న దాసిరెడ్డి కమర్షియల్ కాంప్లెక్స్‌లో శవాన్ని వదిలేశారు. తన భర్తను ఎల్‌ఐసి గంగరాజే హత్య చేశాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించింది.

English summary

 YS Jagan's YSR Congress party candidate in ward elections, Puliraju has been murdered in Kadapa district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X