వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరదలు: మోడీ పర్యవేక్షణ, కేదార్‌నాథ్ ఇలా...(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో వరదలు ఇటీవల భారీ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. యమను, భాగీరథి, మందాకిని, అలకనంద తదితర నదుల ఉధృతికి రోడ్లు తెగిపోయాయి. భవంతులు కూలిపోయాయి. వేలాది మంది చనిపోయారు. దాదాపు లక్ష మంది వరదల్లో చిక్కుకుపోవడంతో వారిని సైన్యం కాపాడింది.

ఉత్తరాఖండ్ వరదలు సునామిని తలపించాయి. కేదార్, రాంవాడ, గౌరీకుండ్, సోన్ ప్రయాగ, ఉకిమఠ్ తదితర ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోయాయి. వేలాది మంది యాత్రికులే కాకుండా, చాలా జంతువులు చనిపోయాయి. వరదల నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ రాష్ట్ర భక్తులను తీసుకు వచ్చే ప్రయత్నాలు చేశాయి. అందులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ముందు నిలిచారు.

వరద బాధితులను ఉత్తరాఖండ్ ప్రభుత్వం, భారత వైమానిక దళం, నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, భారత సైన్యం, ఇండో టిబిటెన్ బోర్డర్ పోలీసు, స్థానిక పోలీసులు.. ఇలా అందరు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. వరద బాధితులకు మోడీ ముఖ్యమంత్రి ఫండ్స్ నుండి రెండు కోట్ల రూపాయలు, ఆ తర్వాత మరో మూడుకోట్ల రూపాయలను విడుదల చేశారు.

మోడీ పర్యవేక్షణ

మోడీ పర్యవేక్షణ

ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం వద్ద గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ.

బాధితులకు మందులు

బాధితులకు మందులు

ఉత్తరాఖండ్ వరదల బాధితుల కోసం తరలిస్తున్న వైద్య సామాగ్రి. వాహనాలలోకి సామాగ్రిని ఎక్కిస్తున్న సిబ్బంది.

వైద్య సహాయ కేంద్రం

వైద్య సహాయ కేంద్రం

గుజరాత్ నుండి వచ్చిన ఓ వైద్య బృందం ఉత్తరాఖండ్ వరద బాధితుడికి వైద్య సహాయం అందిస్తున్న దృశ్యం.

మెడికల్ రిలీఫ్

మెడికల్ రిలీఫ్

ఉత్తరాఖండ్ వరద బాధితులకు వైద్య సహాయం కోసం గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ మొబైల్.

కేదార్‌నాథ్ ఇలా..

కేదార్‌నాథ్ ఇలా..

గత నెలలో వచ్చిన భారీ వరదల కారణంగా పవిత్ర కేదార్‌నాథ్ గ్రామం ఇలా తుడిచి పెట్టుకుపోయింది. చాలా ప్రాంతాలు వరదల్లో కొట్టుకుపోయాయి.

English summary
The unprecedented natural disaster in Uttarakhand shocked India as cloud bursts and heavy rainfall in the catchment areas and valleys of rivers Yamuna, Bhagirathi, Mandakini and Alaknanda destroyed roads, buildings, bridges, killing and stranding thousands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X