వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుండెపోటుతో కోటగిరి విద్యాధర రావు ఆకస్మిక మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kotagiri Vidyadhara Rao
ఏలూరు: మాజీ మంత్రి కోటగిరి విద్యాధర రావు హఠాన్మరణం చెందారు. ప్రస్తుతం ఆయన ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ (పిసిసి) అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆయన శనివారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని తన నివాసంలో ఆయన కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించేలోగానే ఆయన మృత్యువాత పడ్డారు.

కొద్ది రోజుల క్రితం ఆయన గుండెకు సంబంధించిన వ్యాధికి చికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. కోటగిరి విద్యాధరరావు ఎన్టీ రామారావు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గాల్లో పనిచేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో తొలిసారి 1994లో మంత్రి పదవి చేపట్టారు. ఆయన వ్యవసాయ శాఖను నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన భారీ పరిశ్రమల మంత్రిగా పనిచేశారు.

1983లో ఆయన శానససభకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985 నుంచి 1999 వరకు వరుసగా ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఆ పార్టీలో చేరి కీలకమైన పాత్ర పోషించారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం కావడంతో ఆయన కాంగ్రెసు పార్టీ నాయకుడిగా ఉన్నారు.

కోటగిరి విద్యాధర రావు మృతికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన మృతికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సంతాపం ప్రకటించారు. కోటగిరి మరణవార్త తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి చిరంజీవి ఢిల్లీ నుంచి హుటాహుటిన బయలుదేరారు.

English summary
Former minister and Congress leader Kotagiri Vidyadhara Rao has passed away due to herat attack this morning at Eluru of West Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X