అవనిగడ్డకు ఉప ఎన్నిక: ఏకగ్రీవానికి టిడిపి యత్నం

వచ్చే నెల 5న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు 7వ తేదీ తుది గడువుగా సిఇసి ప్రకటించింది. వచ్చే నెల 21న పోలింగ్ కాగా 24న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
అయితే సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరంలోపు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే, ఆ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించబోమని గతంలో సిఇసి ప్రకటించింది.
బ్రాహ్మణయ్య మృతి చెందిన తేదీకి ఎన్నికలు సంవత్సరానికి పైగా ఉండడం వల్ల ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
కొంత మంది శాసనసభ్యులు రాజీనామా చేయడం వల్ల, కొంత మందిపై అనర్హత వేటు పడడం వల్ల రాష్ట్రంలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడం లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. కాగా, అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు హరిబాబును పోటీకి దించాలని తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తోంది. ఆయన ఎన్నిక ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నాలు చేయాలని అనుకుంటోంది.












Click it and Unblock the Notifications