వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవనిగడ్డకు ఉప ఎన్నిక: ఏకగ్రీవానికి టిడిపి యత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

Krishna Map
హైదరాబాద్: కృష్ణా జిల్లా అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల 21న ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూలు ప్రకటించింది. ఈ నెల 27న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే నెల 3వ తేదీ చివరి గడువు.

వచ్చే నెల 5న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు 7వ తేదీ తుది గడువుగా సిఇసి ప్రకటించింది. వచ్చే నెల 21న పోలింగ్ కాగా 24న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

అయితే సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరంలోపు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే, ఆ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించబోమని గతంలో సిఇసి ప్రకటించింది.
బ్రాహ్మణయ్య మృతి చెందిన తేదీకి ఎన్నికలు సంవత్సరానికి పైగా ఉండడం వల్ల ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

కొంత మంది శాసనసభ్యులు రాజీనామా చేయడం వల్ల, కొంత మందిపై అనర్హత వేటు పడడం వల్ల రాష్ట్రంలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడం లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. కాగా, అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు హరిబాబును పోటీకి దించాలని తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తోంది. ఆయన ఎన్నిక ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నాలు చేయాలని అనుకుంటోంది.

English summary
Byelection to the Avanigadda assembly constituency to be held on August 21, which was vacated due to the death of Telugudesam MLA Ambati Brahmaniah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X