వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గండ్ర కోడ్ ఉల్లంఘన: జగన్ పార్టీకి పాస్టర్ మద్దతు, కేసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Elections
వరంగల్/ఖమ్మం: ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి శనివారం కోడ్ ఉల్లంఘించారు. వరంగల్ జిల్లాలోని శాయంపేటలో ఎన్నికల కోడ్‌ను అతిక్రమించారు. కాంగ్రెసు పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయాలని గండ్ర స్థానికి చర్చి ప్రాంగణంలో ప్రచారం నిర్వహించారు.

చర్చి ప్రాంగణంలోనే చీఫ్ విప్‌తో పాటు పార్టీ నాయకులు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు వేశారు. అదే వేదికగా గండ్ర ఇరవై నిమిషాల పాటు మాట్లాడారు. దళితుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ.. కాంగ్రెసు మద్దతుదారుకు ఓటేయాలని కోరారు. ప్రార్థనాలయాల్లో ప్రచారం నిర్వహించడం కోడ్ ఉల్లంఘన కిందకి వస్తుందని మండల ఎన్నికల అధికారి తహసీల్దారు తెలిపారు.

పాస్టర్ పైన కేసు

ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా మాట్లాడిన ఓ పాస్టర్ పైన కేసు నమోదైంది. సదరు పాస్టర్ పంచాయతీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారులకు ఓటేయాలని అడిగారు. ఈ విషయమై జయమ్మ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రార్థన సమయంలో ఓ వర్గానికి చెందిన దాదాపు వంద మంది ప్రజలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారుకు ఓటేయాలని అడిగారని ఆమె ఫిర్యాదు చేశారు. మతపరంగా ఓట్లు అడగటం సరికాదని ఆమె పేర్కొన్నారు. పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
A case has been registered against the head of a 
 
 community for purposredly invoking religious 
 
 obligations seeking votes for a candidate of the YSR 
 
 Congress in Khammam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X