వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేసు: ఐఎఎస్‌ల ప్రాసిక్యూషన్‌పై హైకోర్టు నోటీసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసు, ఒఎంసి, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుల్లో నిందితులైన ఐదుగురు ఐఎఎస్ అధికారుల ప్రాసిక్యూషన్ వ్యవహారంపై హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐదుగురు ఐఎఎస్ అధికారులు బిపి ఆచార్య, మన్మోహన్ సింగ్, శామ్యూల్, ఎల్వీ సుబ్రహ్మణ్యం, వెంకట్రామిరెడ్డి ప్రాసిక్యూషన్‌ వ్యవహారాన్ని పెండింగులో ఉంచడానికి కారణాలపై రెండు వారాల్లోగా నివేదిక అందించాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

ఐఎఎస్ అధికారుల ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని కోరుతూ కుటుంబ రావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆ నోటీసులు జారీ చేసింది. వైయస్ జగన్ ఆస్తులు, ఒఎంసి, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసుల్లో ఆరుగురు ఐఎఎస్ అధికారులు నిందితులుగా ఉన్నారు. వారిలో శ్రీలక్ష్మి ప్రాసిక్యూషన్‌కు మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. మిగతా ఐదుగురి విషయాన్ని పెండింగులో పెట్టింది.

ఐదుగురు ఐఎఎస్ అధికారుల ప్రాసిక్యూషన్ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులోనే కాకుండా ఒఎంసి కేసులో కూడా శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉంది. ఐఎఎస్ అధికారుల ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడంలో జాప్యం జరగడం వల్ల విచారణలో కూడా జాప్యం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసి ఏడాది దాటుతోంది. ఒఎంసి కేసు విచారణ కూడా ఇంకా ప్రారంభం కాలేదు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ కొన్ని చార్జిషీట్లను దాఖలు చేసింది. వాటిపై కూడా విచారణ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.

English summary
Andhra Pradesh High Court has issued notice to the union government on the issue of prosecution of five IAS officers in YS Jagan, Gali Janardhan rddy's OMC, EMAAR properties cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X