• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోడీయే ప్రధాని అభ్యర్థి: తెలంగాణ ప్రత్యేకమన్న రాజ్

By Srinivas
|

Rajnath Singh virtually anoints Modi as PM candidate
న్యూయార్క్/న్యూఢిల్లీ: 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దాదాపు ఖరారైనట్లే. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అమెరికాలో చూచాయగా వెల్లడించారు. బిజెపి గెలిస్తే మోడీ అత్యున్నత పీఠాన్ని అధిరోహిస్తారని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. బిజెపి ప్రధాని అభ్యర్థి మోడీయేనని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.

ప్రజాకర్షక నాయకుడుగా, ప్రధాని అభ్యర్థిగా పార్టీ అధ్యక్షుడే ఉండాల్సిన అవసరం లేదన్నారు. 2014 ఎన్నికల్లో విజయపథాన నడిపించే బాధ్యతను పార్టీ నాకు అప్పగించిందని, ఆ దిశగా తాను కృషి చేస్తానని వెల్లడించారు. న్యూయార్క్, వాషింగ్టన్‌లలో ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఇక్కడకు వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఎన్నికలకు ఏడు నెలల ముందు ప్రచార కమిటీ చైర్మన్‌గా మోడీని నియమించామనీ, అన్ని పార్టీల మాదిరిగానే మోడీ నియామకం జరిగిందని తెలిపారు.

ఇందులో అసాధారణమేమీ లేదు. మోడీకున్న ప్రజాకర్షణ, ప్రతిష్ఠ, పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే గుణమే ఆయన నియామకానికి కారణమని పేర్కొన్నారు. భారత్‌లో ప్రస్తుతం అత్యంత ప్రజాదరణతో పాటు అతి పెద్ద నాయకుడు నరేంద్ర మోడీయేనని చెప్పిన ఆయన, పరోక్షంగా ప్రధాని అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేశారు. ఒక్క గుజరాత్‌లోనే కాదు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్‌లలోనూ మోడీకి ప్రజాకర్షణ ఉందని తెలిపారు.

పార్టీ అధ్యక్షుడిగా ప్రధాని అభ్యర్థిత్వానికి ఎందుకు పోటీపడటం లేదన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తానన్నారు. అవినీతితో ప్రజాకంటకంగా మారిన కాంగ్రెస్‌ను గద్దె దింపడమే పార్టీ అధ్యక్షుడుగా తన లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల హామీలపై ఆయన బదులిస్తూ, రామజన్మభూమి అంశం కన్నా అభివృద్ధి అంశాల ద్వారానే బిజెపి ప్రజల్లోకి వెళుతుందన్నారు.

జాతీయ దృక్పథంలో రామజన్మభూమి అంశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, కానీ ఎన్నికల్లో దానికి అంత ప్రాధాన్యత లేదని వివరించారు. మోడీకి వీసా ఇవ్వాలని అమెరికాను కోరుతామని చెప్పారు. తలెంగాణకు అనూకూలమైన జాతీయ పార్టీ బిజెపి ఒక్కటేనన్నారు. జాతీయ కార్యవర్గంలోను దీనిపై తీర్మానం చేశామని, తెలంగాణపై కాంగ్రెసులో వలె బిజెపిలో ఎటువంటి సందిగ్ధత లేదన్నారు. తెలంగాణకు తాము అనుకూలమని, అయితే ఉత్తర ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల విభజనకు వ్యతిరేకమన్నారు. తెలంగాణ ప్రత్యేకమైన అంశమన్నారు.

హిందుత్వ పునాదిగా హిందుస్థాన్

హిందుత్వం పునాదిగా సమర్థుడయిన నాయకుడి ద్వారా బలమైన భారతదేశాన్ని నిర్మించడమే తన లక్ష్యమని ఆదివారం ఆర్ఎస్ఎస్ ప్రకటించింది. మార్పు అనేది ఎప్పుడు కూడా సమాజం నుంచే వస్తుంది తప్ప రాజకీయాల ద్వారా కాదని, అధికారంలో ఉన్న వ్యక్తులను మార్చినంత మాత్రాన పెద్దగా ప్రయోజనం ఉండదని, హిందుత్వ సిద్ధాంతం ఆధారంగా సమాజంలో సరైన మార్పును తీసుకు రావలసిన అవసరం ఉందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary

 Ruling himself out of the prime ministerial race, BJP President Rajnath Singh on Sunday virtually anointed Narendra Modi as its man to the top job if the party comes to power after the 2014 Lok Sabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more