• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అక్కడే నాడు విలియం, నేడు రాయల్ బేబీ(పిక్చర్స్)

By Srinivas
|

లండన్: బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం దంపతులకు రెండు రోజుల క్రితం మగబిడ్డ జన్మించాడు. బ్రిటన్ కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4.24 గంటలకు విలియం భార్య కేట్ మిడిల్‌టన్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ముప్పై ఒక్క ఏళ్ల కేట్ మిడిల్‌టన్ ప్రసవం కోసం లండన్‌లోని సెయింట్ మేరీ ఆసుపత్రిలో సోమవారమే చేరారు. వెంట భర్త ప్రిన్స్ విలియమ్స్ ఉన్నారు. ఇదే ఆసుపత్రిలో లిండో వింగులో డయానా.. విలియంకు, హారీకి గతంలో జన్మినిచ్చారు.

బ్రిటన్ రాయల్ బేబీ బ్రిటన్ సింహాసనానికి మూడో వారసుడు. దీంతో దేశమంతా సంబరాలు చేసుకున్నారు. పలు దేశాధినేతల నుండి, రాజ కుటుంబాల నుండి అభినందనలు వెల్లువెత్తాయి. రాయల్ బేబీ పుట్టిన నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ప్రదేశాలు దేశవ్యాప్తంగా ఉన్న ఫౌంటెయిన్లు రంగురంగుల దీపాలతో కొత్తహంగులు అద్దుకున్నాయి. కేట్ మిడిల్‌టన్‌కు క్షేమంగా ప్రసవమైందని, 3.8 కిలోల బరువున్న మగబిడ్డ పుట్టాడని, తల్లీ బిడ్డా క్షేమంగానే ఉన్నారని కెన్సింగ్‌టన్ ప్యాలెస్ వర్గాలు ప్రకటించగానే సంబరాలు ప్రారంభమయ్యాయి.

ప్రసవం సాయంత్రమే అయినా రాజకుటుంబం ఆనందానికి మీడియా, ప్రజల వల్ల విఘాతం కలగకుండా రాత్రి ఎనిమిదిన్నరదాకా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారు. మంగళవారం మిడిల్ టన్ ఆసుపత్రి నుండి ఇంటికి చేరుకున్నారు. కాగా మునిమనవడి జననంతో ఎంతగానో సంతోషిస్తున్నట్టు ఎలిజబెత్ ప్రకటించారు. మొదటిసారిగా తాత అయిన ఆనందంలో మునిగితేలుతున్నానని ప్రిన్స్ చార్లెస్ సంతోషం వెలిబుచ్చారు. కాగా సెయింట్ మేరీస్ ఆస్పత్రిలో ప్రసవించిన కేట్ మిడిల్‌టన్‌కు వైద్యం చేసిన బృందంలో మనదేశానికి చెందిన సునీత్ గొడాంబే కూడా ఉన్నారు. మరోవైపు కొత్తగా పుట్టిన పిల్లాడికి పేరు పెట్టే విషయంపై అంతటా చర్చ సాగుతోంది.

రాయల్ బేబీతో కేట్, విలియమ్

రాయల్ బేబీతో కేట్, విలియమ్

తమకు పుట్టిన చిన్నారితో బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్‌టన్‌లు. లండన్‌లోని ప్రముఖ సెయింట్ మెరీస్ ఆసుపత్రిలో కేట్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పిల్లాడితో తల్లిదండ్రులిద్దరు చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యం

పిల్లాడిని ఎత్తుకున్న విలియం

పిల్లాడిని ఎత్తుకున్న విలియం

తమకు పుట్టిన చిన్నారితో బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్‌టన్‌లు. లండన్‌లోని ప్రముఖ సెయింట్ మెరీస్ ఆసుపత్రిలో కేట్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పిల్లాడిని ఎత్తుకున్న ప్రిన్స్ విలియం

కేట్ తల్లిదండ్రులు

కేట్ తల్లిదండ్రులు

లండన్‌లోని ప్రముఖ సెయింట్ మెరీస్ ఆసుపత్రిలో బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం సతీమణి కేట్ మిడిల్‌టన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డను చూసి ఆనందిస్తున్న కేట్ తల్లిదండ్రులు కరోల్, మైఖేల్ మిడిల్‌టన్

అభినందనల వెల్లువ

అభినందనల వెల్లువ

బ్రిటన్ యువరాజు సతీమణి కేట్ మిడిల్‌టన్ పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో రాజకుటుంబానికి అభినందనలు వెల్లువెత్తాయి. ప్రిన్స్ చార్లెస్‌కు అభినందనలు తెలియజేస్తున్న పలువురు...

రాయల్ ప్రకటన

రాయల్ ప్రకటన

బ్రిటన్ యువరాజు సతీమణి కేట్ మిడిల్‌టన్ పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో రాజకుటుంబం నివాసం ఉండే బకింగ్ హామ్ ప్యాలెస్ వద్ద యువరాణి పిల్లాడికి జన్మనిచ్చినట్లుగా అధికార ప్రకటన ఉంచారు.

ముద్దొచ్చే బాలుడు

ముద్దొచ్చే బాలుడు

పుట్టిన చిన్నారితో బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్ సతీమణి కేట్ మిడిల్‌టన్ లండన్‌లోని ప్రముఖ సెయింట్ మెరీస్ ఆసుపత్రి ప్రాంగణంలో ఎత్తుకొని నిలబడిన దృశ్యం

నానమ్మ, తాతయ్య

నానమ్మ, తాతయ్య

కేట్ మిడిల్‌టన్ పిల్లాడికి జన్మనివ్వడంతో చూసేందుకు వచ్చిన ప్రిన్స్ చార్లెస్, సతీమణి కామిల్లా. ఆసుపత్రి ప్రాంగణంలో ప్రజలకు అభివాదం చేస్తున్న దంపతులు.

నాటి మధుర జ్ఞాపకం

నాటి మధుర జ్ఞాపకం

1982లో పుట్టిన ప్రిన్స్ విలియంకు డయానా లండన్‌లోని ఇదే(సెయింట్ మెరీస్) ఆసుపత్రిలో జన్మనిచ్చారు. నాడు తన బిడ్డ ప్రిన్స్ విలియంను ఆసుపత్రిని ఇంటికి తీసుకు వెళ్తున్న డయానా, ప్రిన్స్ చార్లెస్. డయానా 1997లో ఓ కారు ప్రమాదంలో మృతి చెందారు.

English summary
The royal couple, Prince William and Duchess of Cambridge Kate showed off their newborn son to the world for the first time on Tuesday. The parents held the future king in their arms as they headed for home from the hospital where Kate gave birth to her first child on Monday. An overjoyed Kate said turning a mother was an emotional moment for her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more