వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన అడ్డుకుందాం రండి: బాబు, జగన్‌లకు వీరశివా

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma and Chnadra babu Naidu
హైదరాబాద్: రాష్ట్ర విభజన వైపు అడుగులు పడుతున్నాయని, సమైక్యాంధ్రకు మద్దతుగా సీమ ప్రాంతానికి చెందిన వారుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మలు రాజీనామా చేయాలని కమలాపురం కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే వీరశివా రెడ్డి గురువారం డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వీరశివా రెడ్డి ఈ రోజు పదవికి, పార్టీకి రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీమాంధ్ర నేతలం విభజనను గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. విభజనను అడ్డుకుంటామన్నారు. సీమాంధ్ర నేతల్లో సీరియస్ లేకపోవడం వల్లనే విభజన వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. అన్ని పార్టీలు విభజనకు అనుకూలంగా మాట్లాడి కాంగ్రెసు పార్టీని దోషిగా చూపుతున్నాయని మండిపడ్డారు. సీమాంధ్ర నేతలం అందరం కలిసి విభజనను గట్టిగా వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు.

తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, లెఫ్ట్ పార్టీలు విభజనవాదానికి తెర లేపారని ఆరోపించారు. విభజన ఆలోచన విరమించుకోవాలని ఆయన బొత్సకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామా ఆమోదించకుంటే సభాపతి చాంబర్ వద్ద ఆందోళన చేసి మరీ ఆమోదింప చేసుకుంటానని చెప్పారు.

హైదరాబాదు వెళ్లాలంటే పాసుపోర్టు తీసుకోవాలని ప్రశ్నించిన వైయస్ పేరు పెట్టుకున్న వైయస్సార్ కాంగ్రెసు, రాష్ట్రం ఐక్యంగా ఉండాలని కోరుకున్న ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి, విశాలాధ్ర పేరుతో పత్రిక స్థాపించిన లెఫ్ట్ పార్టీలు విభజనకు మద్దతునిచ్చాయని ఆరోపించారు. విభజన అడ్డుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

వ్యక్తిగతం: బలరాం నాయక్

ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ఏర్పాటు ఖాయమని కేంద్రమంత్రి బలరామ్ నాయక్ వేరుగా అన్నారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేస్తున్న వారిది వారి వ్యక్తిగతమన్నారు. నక్సల్స్ తమ సోదరులే అన్నారు.

English summary
The Telangana statehood issue is on the boil again with the Kamalapuram Congress MLA Veerasiva Reddy was resigned on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X