వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాయల టియే: ఎవరేంటి? మన మినిస్టర్స్ రోల్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణపై అధికార కాంగ్రెసు పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. తెలంగాణపై మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు యూపిఏ సమన్వయ కమిటీ భేటీ కానుంది. ఆ తర్వాత ఐదున్నర గంటలకు సిడబ్ల్యూసి భేటీ ఉంది. రేపు సాయంత్రంలోగా తెలంగాణపై అధిష్టానం ఏదో ఒక నిర్ణయం తీసుకోనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్రంలోని పరిస్థితులను బట్టి నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటించాలనే నిర్ణయానికి కాంగ్రెసు అధిష్టానం రానుందని సమాచారం.

యూపిఎ సమన్వయ కమిటీ భేటీలో భాగస్వామ్య పార్టీల నిర్ణయన్ని కాంగ్రెసు తీసుకోనుంది. సిడబ్ల్యూసిలో దానిపై చర్చించి ఓ నిర్ణయానికి రానుంది. అధికార పార్టీ దాదాపు రాయల తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీ నిర్ణయాన్ని రేపు అధిష్టానం ప్రకటించే అవకాశముంది. ఆ తర్వాత ఇరు ప్రాంతాల్లోని పరిస్థితిని చూసి కేంద్రం నుండి ప్రకటన రావొచ్చునని చెబుతున్నారు.

నిర్ణయమే తరువాయి...

నిర్ణయమే తరువాయి...

కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణ విషయంలో వడివడిగా అడుగులు వేస్తోంది. మంగళవారం యూపిఏ సమన్వయ కమిటీ భేటీ, సిడబ్ల్యూసి భేటీ జరగనుంది. ఈ భేటీల్లో తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోనుంది. అయితే ఇప్పటికే అధిష్టానం రాయల తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని, దానిపై మిత్ర పక్షాలతో చర్చించనుందని తెలుస్తోంది.

శరద్ పవార్

శరద్ పవార్

ఎన్సీపి అధినేత శరద్ పవార్ తెలంగాణను వ్యతిరేకించడం లేదు. అయితే విదర్భను తేల్చమని యూపిఏ సమన్వయ కమిటీ భేటీలో పట్టుబట్టే అవకాశాలు లేకపోలేదు. విదర్భ విషయంలో ఓ హామీ ఇచ్చి పవార్‌ను కాంగ్రెసు పార్టీ అధిష్టానం కన్విన్స్ చేయాల్సి ఉంటుంది.

అజిత్ సింగ్

అజిత్ సింగ్

రాష్ట్రీయ లోకదళ్ అధ్యక్షుడు అజిత్ సింగ్ తెలంగాణకు అనుకూలం. రాష్ట్ర సాధన కోసం ఆ పార్టీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రీయ లోకదళ్‌ను కూడా ప్రారంభించింది. తెలంగాణ ఇవ్వాలని ఆయన యూపిఏలో ఎప్పటి నుండో వాదిస్తున్నారు.

ఫరూక్ అబ్దుల్లా

ఫరూక్ అబ్దుల్లా

జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తెలంగాణను వ్యతిరేకించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ఫరూక్‌తో ఫోన్ ద్వారా చర్చించారు. తెలంగాణకు ఒప్పుకోవద్దని అసద్ ఆయనకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫరూక్ యూపిఏ భేటీలో తెలంగాణ, రాయల తెలంగాణకు ఒప్పుకునే అవకాశాలు తక్కువ.

ములాయం & మాయావతి

ములాయం & మాయావతి

యూపిఏకు బయటి నుండి మద్దతిస్తున్న సమాజ్‌వాది, బహుజన సమాజ్‌వాది పార్టీలలో ములాయం సింగ్ యాదవ్ తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, మాయావతి మద్దతు పలుకుతున్నారు. వీరు బయటి నుండి మద్దతిస్తున్నందున అంత ప్రభావం చూపే అవకాశం లేదు.

రాయల తెలంగాణ

రాయల తెలంగాణ

కాంగ్రెసు పార్టీ అధిష్టానం రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. తెలంగాణ, సీమాంధ్ర వల్ల కాంగ్రెసు పార్టీకి లాభం లేదని భావిస్తున్న ఆ పార్టీ రాయల తెలంగాణతో ఇరు ప్రాంతాల్లో కొంత నష్టపోయినా, లబ్ధి చేకూరుతుందని భావిస్తోందని అంటున్నారు. రాష్ట్రాన్ని విభజించి హైదరాబాదును కొన్నేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని, రెవెన్యూను ఇరు ప్రాంతాలకు ఇవ్వాలని భావిస్తోందట.

కిరణ్ ససేమీరా అంటే...

కిరణ్ ససేమీరా అంటే...

విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేస్తే రాష్ట్రపతి పాలన విధించి అయినా ప్రకటన చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నదని అంటున్నారు. అయితే రాయల తెలంగాణను రాయలసీమవాసులు ఏ మేరకు అంగీకరిస్తారనేది ప్రశ్నార్థకం.

ఆహార బిల్లును సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు అడ్డుకుంటే..

ఆహార బిల్లును సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు అడ్డుకుంటే..

యూపిఏ 3 అధికారంలోకి వచ్చేందుకు ఆహార బిల్లును సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు అడ్డుకునే పరిస్థితి వస్తే మాత్రం రాయల తెలంగాణ లేదా తెలంగాణ పైన నిర్ణయాన్ని అధిష్టానం వాయిదా వేసుకునే అవకాశాలు లేకపోలేదు.

విభజిస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు రాజీనామా చేస్తారనే ప్రచారం నేపథ్యంలో.. వారు రాజీనామా చేసినా, రాష్ట్రపతి పాలన విధించి ప్రకటన చేయాలని చూస్తున్నారని సమాచారం. అయితే యూపిఏ 3 అధికారంలోకి వచ్చేందుకు కీలకమైన ఆహార బిల్లును సీమాంధ్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు అడ్డుకునే పరిస్థితి ఏర్పడితే మాత్రం అధిష్టానం వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

యూపిఏలో కాంగ్రెసుతో పాటు ఎన్సీపి, ఆర్ఎల్డీ, జమ్ము కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెసు, సిక్కిమ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తదిత పార్టీలు ఉన్నాయి. ఎన్సీపి, ఆర్ఎల్డీ, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలే ఇందులో కీలకం. బయటి నుండి ఎస్పీ, బిఎస్పీ, రాష్ట్రీయ జనతా దళ్ మద్దతిస్తున్నాయి.

English summary
Veering towards conceding the demand for a separate Telangana, the Congress has convened a meeting of its working commitee, the Party's Highest policy making body, on Tuesday after deliberations on the issue in the UPA coordination committe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X