వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ రిజైన్ చేయలేదు: రేణుక, టికి వ్యతిరేకం: ఒమర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

omar abdullah and renuka chaudhary
న్యూఢిల్లీ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నుండి కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఎలాంటి రాజీనామా లేఖను అందుకోలేదని ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి మంగళవారం చెప్పారు. కిరణ్ రాజీనామా చేయలేదన్నారు. ఇలాంటి విషయాలపై మీడియా సంయమనం పాటించాలని ఆమె హితవు పలికారు.

సోనియాతో చిరు, పురంధేశ్వరి భేటీ

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో కేంద్రమంత్రులు చిరంజీవి, దగ్గుపాటి పురంధేశ్వరి, పల్లం రాజు, పనబాక లక్ష్మి, ఎంపీ లగడపాటి రాజగోపాల్, కెవిపి రామచంద్ర రావు, అనంత వెంకట్రామి రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వారు అధినేత్రిని కోరినట్లుగా సమాచారం. అంతకుముందు సోనియాతో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఆ తర్వాత కేంద్రమంత్రులు గులాం నబీ ఆజాద్, సుశీల్ కుమార్ షిండే, దిగ్విజయ్ సింగ్, సీనియర్ నేత అహ్మద్ పటేల్‌లు ఉన్నారు. మరికాసేపట్లో సీమాంధ్ర నేతలు ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని కలిసే అవకాశాలున్నాయి.

మేం వ్యతిరేకం: ఒమర్

తాము ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకమని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మంగళవారం ప్రకటించారు. యూపిఏలో ప్రధాన భాగస్వామి అయిన నేషనల్ కాన్ఫరెన్స్ తాము తెలంగాణకు వ్యతిరేకమని ప్రకటించడం గమనార్హం. అయితే హైదరాబాద్ ఎంపి, మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సూచనల మేరకే నేషనల్ కాన్ఫరెన్స్ వ్యతిరేకిస్తోందని సమాచారం.

సీమాంధ్ర నేతల్లో అసంతృప్తి

రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని దిగ్విజయ్ సింగ్‌ను సీమాంధ్ర నేతలు కోరారు. ఆయన నుండి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో వారు నిరాశకు లోనయ్యారు.

English summary
AICC spokesperson Renuka Chaudhary said on Tuesday that Congress High Command did not received any resignation letter from CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X