వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీకి కెకె గుడ్‌బై! పార్టీ ఆఫీస్‌కు రంగు పడింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

KK Mahender Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తెలంగాణ చిచ్చు ముదిరి పాకాన పడింది. మాజీ మంత్రి కొండా సురేఖ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఘాటైన లేఖ రాయగా.. తెలంగాణ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కెకె మహేందర్ రెడ్డి పార్టీకి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు త్వరలో ప్రకటించనున్నారని సమాచారం.

కెకె తెలంగాణలోని మూడు జిల్లాలకు పార్టీ ఇంఛార్జిగా ఉన్నారు. కెకె మహేందర్ రెడ్డి ఈ హోదాలో ఒకటి రెండు రోజుల్లో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిసి తెలంగాణపై వినతి పత్రం ఇవ్వనున్నారు. ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేయనున్నట్లు చర్చ జరుగుతోంది. ఆ పార్టీ నేతలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, రాజ్ ఠాకూర్‌లు కూడా రాజీనామా బాటలో ఉన్నారు.

తెలంగాణలోని ఐదు జిల్లాల బాధ్యుడిగా వ్యవహరిస్తున్న మరో నేత జిట్టా బాలకృష్ణా రెడ్డి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నైజం బయటపడిందని జిట్టా సోమవారం రాత్రి ధ్వజమెత్తారు.

పార్టీ నాయకత్వం తాజాగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలంగాణకు అనుకూలంగా ఎక్కడా ఒక్క పదం లేకపోవటాన్ని తీవ్రంగా ఎండగట్టారు. "మాట తప్పం.. మడమ తిప్పం అంటూ అసలు రంగు బయటపెట్టుకున్నారు. తెలంగాణ వ్యతిరేక చర్యలకు పాల్పడితే.. రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని అడ్డుకుంటే దాడులు తప్పవు'' అని తీవ్రంగా హెచ్చరించారు.

రంగుపడింది

తెలంగాణపై పార్టీ వైఖరిని నిరసిస్తూ వరంగల్ జిల్లాలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయానికి కార్యకర్తలు రంగులు వేశారు. పార్టీ కార్యాలయాలను మూసివేశారు. కార్యాలయం ఎదుట, లోపల ఉన్న అధినేత వైయస్ జగన్ బొమ్మపై రంగు పడింది!

కొండా సురేఖ దిష్టిబొమ్మ దగ్ధం

జగన్‌కు ఘాటైన లేఖ రాసిన నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కొండా సురేఖ దిష్టి బొమ్మను దగ్ధం చేసింది.

English summary

 YSR Congress Party senilr leader KK Mahender Reddy may met Central Home Minister Sushil Kumar Shinde within two days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X