వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ గురించి సూరీడు చెప్తే నమ్మలేదు: కొండా సురేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha and Ys Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యక్తి గత సహాయకుడిగా పని చేసిన సూరీడు తమకు ఎప్పుడో చెప్పారని, అప్పుడు ఆయన మాటలను తాము నమ్మలేదని మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అసంతృప్త నేత కొండా సురేఖ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ బిడ్డల పోరాటానికి తుది నిర్ణయం వెలువడుతున్నందుకు సంతోషంగా ఉందని ఆమె అన్నారు. తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పలేదన్నారు. వారే తమను బయటకు పంపించే ప్రయత్నాలు చేశారన్నారు. జగన్‌కు, పార్టీకి తాము మొదటి నుండి లాయల్‌గా ఉన్నా తమకు గౌరం లేకుండా పోయిందన్నారు. తమ లాంటి లాయల్ వ్యక్తులు పార్టీ నుండి వెళ్లిపోతున్నా ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు.

మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటే కొండా మురళీ ఊరుకున్నారని కానీ, ఆయనకు ఇవ్వకుండా ఎవరికో ఇచ్చారని మండిపడ్డారు. మురళీ ఎమ్మెల్సీ పదవికి ఎందుకు అర్హులు కారో చెప్పాలన్నారు. తాను, జగన్ వేదిక పైకి వస్తే తనకే ఆదరణ లభిస్తోందన్నారు. అది ఓర్వలేకే తనను బయటకు పంపించే ప్రయత్నాలు చేశారన్నారు. తెలంగాణ గురించి అడిగితే జగన్ దాటవేసే వారన్నారు.

జగన్ పైన తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. తమను పార్టీ నుండి వెళ్లేలా చేస్తున్నారన్నారు. తెలంగాణకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనుకూలంగా లేదన్నారు. పదహారు మంది ఎమ్మెల్యేలు తమను సంప్రదించకుండా ఎలా రాజీనామా చేశారని ప్రశ్నించారు. జగన్‌తో తాము వెళ్లినప్పుడు, జగన్ వ్యక్తిత్వం తనకు తెలుసునని వద్దని చెబితే, తాము అతనిని తిట్టి పంపించామని, నిన్న ఆ విషయాన్ని తాము గుర్తు చేసుకున్నట్లు చెప్పారు.

English summary
Former Minister and Warangal senior leader Konda Surekha has lashed out at YSR Congress for party stand on Telangana statehood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X