వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆచితూచి స్పందిద్దాం: కెసిఆర్, కంటతడి పెట్టిన కెకె

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఈ రెండు రోజులు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, ఆ పరిణామాలపై ఆచితూచి స్పందిద్దామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి నేతలకు సూచించారు. పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు నివాసంలో ఐకాస నేతలతో కెసిఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ పై మంగళవారం కాంగ్రెసు పార్టీ తన విధానాన్ని స్పష్టం చేస్తుందని, ప్రకటన తర్వాత పార్టీలోని అందరు కలిసి చర్చించుకుందామని చెప్పారు.

TRS seek pure Telangana
హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందే వరకు అప్రమత్తంగా ఉండాలని, అప్పటి వరకు పోరాటాన్ని కొనసాగించాల్సిందేనని ఈ సందర్భంగా నిర్ణయించారు. మంగళవారం నాటి యూపీఏ సమన్వయ కమిటీ భేటీ, సిడబ్ల్యూసి సమావేశంలోనూ తెలంగాణపై పూర్తి స్థాయిలో స్పష్టత రాకపోవచ్చని, తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు కాంగ్రెస్ ఒక ప్రకటన చేయవచ్చని అంచనా వేశారు.

కాంగ్రెస్ నేతల ద్వారా ఆరా తీసిన మేరకు ఆ పార్టీ పది జిల్లాల తెలంగాణకు సుముఖంగానే ఉందని, హైదరాబాద్ పైనే కొంత కిరికిరి పెడితే పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌పై కిరికిరి పెడితే ఏయే అంశాలపై పెట్టవచ్చనే చర్చ కూడా ఈ సందర్భంగా జరిగింది. మంగళవారం కాంగ్రెస్ నుంచి ఒకవేళ తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వచ్చినప్పటికీ, ఆగస్టు ఒకటిన ఐకాసఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నాను యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించారు.

కేశవరావు కంటతడి

ఈ భేటీలో కెకె కంటతడి పెట్టారు. తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమయ్యే సమయం వచ్చిందని ఉద్విగ్నంగా చెప్పిన ఆయన కెసిఆర్‌ను ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెసు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి తాను రాసిన రాజీనామా లేఖ పరిణామాలను వివరించారు.

English summary
The Telangana JAC and TRS leaders who held an emergency meeting, expect the Congress high command to honour its commitment and announce Telangana with 10 districts and Hyderabad as its capital on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X