వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోటోలు: తెలంగాణపై ఢిల్లీలో బిజీ, హైద్రాబాద్‌లో ఉత్కంఠ

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ విషయంలో మంగళవారం జులై 30వ తేదీ చారిత్రక దినంగా నిలిచిపోనుంది. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) నిర్ణయం తీసుకుని, రాజ్యాంగపరంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణపై నిర్ణయం సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకునే వరకు కూడా ఢిల్లీ సమావేశాలతో తీరిక లేకుండా ఉండిపోయింది. భేటీలు, సమావేశాలతో క్షణక్షణం ఉత్కంఠ రేకెత్తిస్తూ వచ్చింది.

హైదరాభాదులోని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, పార్టీ నేతలు సిడబ్ల్యుసి నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తూ వచ్చారు. తెలంగాణ రాజకీయ జెఎసి కూడా ప్రత్యేకంగా సమావేశమైంది. తెలంగాణపై మంగళవారం ఉదయం నుంచి హడావిడి ప్రారంభమైంది. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి సీమాంధ్ర నాయకులు చివరి ప్రయత్నాలన్నీ చేశారు. కేంద్ర మంత్రులు చిరంజీవి, పల్లంరాజు, జెడి శీలం, పురంధేశ్వరిలతో పాటు పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు దిగ్విజయ్ సింగ్‌ను, ఆ తర్వాత పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు.

సిడబ్ల్యుసి సమావేశంలో పిఎం, సోనియా

సిడబ్ల్యుసి సమావేశంలో పిఎం, సోనియా

తెలంగాణపై ఢిల్లీ రాజకీయాలు మంగళవారం వేడెక్కాయి. తెలంగాణపై మంగళవారం సాయంత్రం జరిగిన సిడబ్ల్యుసి సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ, తదితర నేతలు ఇలా.. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలని సిడిబ్ల్యుసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని

పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని

పదేళ్ల పాటు హైదరాబాదును రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా పరిగణించాలని సిడబ్ల్యుసి సూచించింది. ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ సహా 22 మంది సభ్యులు పాల్గొని తెలంగాణ ఏర్పాటుకు ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ప్రధాని నివాసం వద్ద ముఖ్యమంత్రి

ప్రధాని నివాసం వద్ద ముఖ్యమంత్రి

ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసం నుంచి బయటకు వస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ప్రధానితో సమావేశమైన తర్వాత బయటకు వచ్చారు. తెలంగాణ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో మన్మోహన్ సింగ్ చర్చించారు.

ప్రధాని నివాసం వద్ద దిగ్విజయ్ సింగ్, కిరణ్ రెడ్డి

ప్రధాని నివాసం వద్ద దిగ్విజయ్ సింగ్, కిరణ్ రెడ్డి

తెలంగాణపై యుపిఎ సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసం నుంచి బయటకు వస్తున్న కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బయటకు వస్తూ ఇలా కనిపించారు. తెలంగాణకు అనుకూలంగా యుపిఎ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది.

యుపిఎ సమావేశంలో రాహుల్ గాంధీ

యుపిఎ సమావేశంలో రాహుల్ గాంధీ

తెలంగాణపై జరిగిన యుపిఎ సమన్వయ కమిటీ సమావేశంలో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. మన్మోహన్, సోనియా గాంధీలతో పాటు రాహుల్ గాంధీని చూడవచ్చు. ఐదు యుపిఎ భాగస్వామ్య పక్షాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణకు అనుకూలంగా యుపిఎ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు అజిత్ సింగ్ చెప్పారు.

ప్రధానితో సోనియా భేటీ

ప్రధానితో సోనియా భేటీ

తెలంగాణపై యుపిఎ, సిడబ్ల్యుసి సమావేశాలకు ముందు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశమయ్యారు. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని సమావేశాలకు ముందే సోనియా గాంధీ సీమాంధ్ర నేతలకు తేల్చి చెప్పారు. దాంతోనే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెలువరించబోతున్నట్లు అర్థమైపోయింది.

తెలంగాణపై సమావేశంలో యుపిఎ నేతలు

తెలంగాణపై సమావేశంలో యుపిఎ నేతలు

తెలంగాణపై జరిగిన సిడబ్ల్యుసి సమావేశంలో భాగస్వామ్య పక్షాల నేతలు ఇలా కొలువు తీరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు ఈ సమావేశంలో మిత్రపక్షాల ఆమోద ముద్రను అధికారికంగా వేయించుకుంది. ఎన్సీపి నేత శరద్ పవార్, ఆర్ఎల్‌డి నేత అజిత్ సింగ్ ముందే తనకు అనుకూలంగా ప్రతిస్పందించారు.

కాంగ్రెసు అధిష్టానం పెద్దలు

కాంగ్రెసు అధిష్టానం పెద్దలు

యుపిఎ సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయడానికి కసరత్తు చేసిన కాంగ్రెసు అధిష్టానం పెద్దలు చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, తదితరులు ఇలా...

తెలంగాణ జెఎసి సమావేశం

తెలంగాణ జెఎసి సమావేశం

తెలంగాణపై సిడబ్వ్యుసి, యుపిఎలు కీలకమైన నిర్ణయం వెలువరించనున్న నేపథ్యంలో హైదరాబాదులో తెలంగాణ జెఎసి సమావేశం జరిగింది. తెలంగాణపై పార్లమెంటులో బిల్లు ఆమోదించే వరకు కాంగ్రెసు పార్టీని నమ్మబోమని తెలంగాణ జెఎసి మొదటి నుంచీ చెబుతూ వస్తోంది. తెలంగాణపై కాంగ్రెసు వెలువరించబోయే ప్రటన కోసం జెఎసి నేతలు ఉత్కంఠగా ఎదురు చూశారు.

కాంగ్రెసు నుంచి పార్టీలోకి వచ్చి కెకెతో కెసిఆర్

కాంగ్రెసు నుంచి పార్టీలోకి వచ్చి కెకెతో కెసిఆర్

తెలంగాణపై యుపిఎ, సిడబ్ల్యుసి సమావేశం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సీనియర్ నేత కె. కేశవరావుతో సమావేశమయ్యారు. రాష్ట్ర ఏర్పాటు సంప్రదింపుల ప్రక్రియలో ఈసారి కెసిఆర్‌కు తగిన ప్రాధాన్యాన్ని కాంగ్రెసు అధిష్టానం కల్పించలేదు. ఆయన కూడా కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం కోసం ఉత్కంఠతోనే ఎదురు చూసినట్లున్నారు.

రాజీనామాలతో వైఎస్ఆర్‌సీపీ లీడర్లు

రాజీనామాలతో వైఎస్ఆర్‌సీపీ లీడర్లు

తెలంగాణకు చెందిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ లీడర్లు రాజీనామాలు చేశారు. ఈ చిత్రంలో జిట్టా బాలకృష్ణా రెడ్డి, కొండా సురేఖ, కెకె మహేందర్ తదితరులను చూడోచ్చు.

తెలంగాణపై తుది నిర్ణయం

తెలంగాణపై తుది నిర్ణయం

మంగళవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో కాంగ్రెసు పార్టీ తెలంగాణపై తన తుది నిర్ణయాన్ని ప్రకటించింది. తొలుత నాలుగు గంటలకు యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం, ఐదున్నర గంటలకు సిడబ్ల్యుసి సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, హైదరాబాదును పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కాంగ్రెసు పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ మంగళవారం తెలిపారు.

తెలంగాణ నాయకులు కూడా వారి ప్రయత్నాలను తిప్పికొట్టడానికి ప్రయత్నాలు సాగించారు. సీమాంధ్ర, తెలంగాణ నేతల కార్యకలాపాలతో ఢిల్లీ వేడివేడిగా కనిపించింది. సిడబ్ల్యుసి, యుపిఎ సమావేశాలకు ముందు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలిశారు. ఆ తర్వాత యుపిఎ సమన్వయ కమిటీ, సిడబ్ల్యుసి సమావేశాలు జరిగాయి.

తెలంగాణపై జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అధిష్టానం పెద్దలు, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సహా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు వివరిస్తూ వచ్చారు. ఆ రకంగా వారిని ప్రక్రియలో భాగస్వాములను చేశారు.

English summary
Delhi is busy with meetings on Telangana issue. UPA coordination committee and CWC endorsed to carve the Telangana state bifurcating Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X