వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా అమ్మ జైలుకెళ్లింది: నెమరేసుకున్న గీతారెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Geetha Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమవుతున్న స్థితిలో రాష్ట్ర మంత్రి జె. గీతారెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన తల్లి చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. దేశంలో 29వ రాష్ట్రంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు కానుండటం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

ఇది చారిత్రాత్మక రోజని అభి వర్ణించారు. అమరవీరులకు కొత్త రాష్ట్రం అంకితమని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తన తల్లి, రిపబ్లికన్ పార్టీ నా యకురాలైన జె.ఈశ్వరీభాయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి జైలు పాలైన రోజులను ఆమె గుర్తు చేసుకున్నారు. భావోద్వేగానికి లోనైనా మంత్రి గీతారెడ్డి త న తల్లిలాంటి వారితోపాటు 1969లోనూ గత పదే ళ్లలోనూ ఎంతో మంది పోరుబాట పట్టారని, వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని వారి త్యాగం వృధా కాలేదని అన్నారు.

తన తల్లి తెలంగాణ ప్రజాసమితి ఉపాధ్యక్షురాలిగా తెలంగాణ కోసం జైలుపాలైన సందర్భాన్ని నెమ రువేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వాళ్లు పలుమార్లు ఈశ్వరీభాయిని గుర్తు చేసుకున్నారని గీతారెడ్డి అన్నారు. తనకు చాలా చాలా ఆనందంగా ఉందని, ఈ క్షణాలను పట్టరాని సంతోషాన్ని మాటల్లో చెప్పలేనని అన్నారు. మాట తప్పని ధీరురాలిగా సోనియాగాంధీ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు.

2009 డిసెంబర్ 9వ తేదీన ఆమె జన్మదినం రోజు ఇచ్చిన మాటను తూచ తప్పకుండా అమలు చేశారని ఆమె సోనియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సిడబ్ల్యుసి, యుపిఎ తెలంగాణకు పచ్చజెండా ఊపడం చరిత్రలో భాగంగా నిలిచిపోతుందని 56 సంవత్సరాలు ఒక ప్రజా ఉద్యమం నిరంతరాయంగా కొనసాగడం దేశంలో ఇదే ప్రథమమని చెప్పారు.

English summary

 Minister from Telangana, J geetha Reddy remembered her mother Eshari bai's seperate Telangana movement waged in 1969.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X