వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యమాన్ని తొక్కేస్తే, తగులబెట్టండి:బాబు, జగన్‌పై ఆనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anam Vivekananda Reddy
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ పాలనలో ఉద్యమం తొమ్మిది వేళ్లు తొక్కివేయబడిందని కానీ, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల కారణంగా మళ్లీ ఉధృత రూపం దాల్చిందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు గ్రామీణ కాంగ్రెసు పార్టీ సభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి మండిపడ్డారు. పచ్చి సమైక్యవాది అయిన దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, గౌరవాధ్యక్షులు వైయస్ విజయమ్మలు తెలంగాణపై తమకు అభ్యంతరం లేదని చెప్పి ప్రత్యేకానికి బీజం వేశారన్నారు.

ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని వస్తున్నా మీకోసం పాదయాత్ర కోసం ప్రకటన చేశారని దీంతో ఉద్యమం ఉధృతం రూపం దాల్చిందన్నారు. తొమ్మిదేళ్లు అణిచివేయబడ్డ ఉద్యమం మీకోసం పేరోత ఓట్ల కోసంతో ప్రారంభమైందన్నారు. విభజనకు జగన్ బీజం వేస్తే బాబుతో చిగురుంచిందన్నారు. విభజనకు కాంగ్రెసు నేతలు తప్ప అన్ని పార్టీలు ఊతమిచ్చాయన్నారు. ఆ కారణంగానే కాంగ్రెసు పార్టీ విభజన నిర్ణయం తీసుకుందన్నారు.

తెలంగాణవాదులు సమైక్యంగా ఉంటే విభజన చేసుకుంటే, తాము సమైక్యంగా లేక రాష్ట్రాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. విభజనలో తిలా పాపం తలా పిడికెడు అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం తపించిన రాజీవ్, ఇందిర విగ్రహాల మెడలో చెప్పులు వేయడమేమిటని ప్రశ్నించారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల వాళ్లే ఈ పని చేస్తున్నారని ఆరోపించారు. వాళ్ల నాయకుల పాపానికి తమ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడమేమిటని ప్రశ్నించారు.

విగ్రహాల ధ్వంసం ఓ పొలిటికల్ బ్లేమ్ గేమ్ అని దుయ్యబట్టారు. రెండు కళ్ల సిద్దాంతమన్న వారు ఇప్పుడు చూపే కోల్పోయారన్నారు. విభజనకు అనుకూలంగా తాము లేఖ రాసిచ్చామని చంద్రబాబు, తాము కూడా సిద్ధంగా ఉన్నామన్న అంబటి రాంబాబుల మెడల్లో చెప్పుల దండ వేయాలన్నారు. వాళ్లను తగులబెట్టాలన్నారు. తాము ఉద్యమం బాట పట్టేందుకు సిద్ధమయ్యామన్నారు. ఎపిఎన్జీవోతో, విద్యార్థులతో మాట్లాడి సకల జనుల సమ్మెకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.

English summary

 SPS Nellore district Nellore rural MLA Anam Vivekananda Reddy has lashed out at TDP chief Nara Chandrababu Naidu and YSR Congress Party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X