వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాదే సమస్య: ఉండవల్లి, కెసిఆర్‌కు కృష్ణ సలహా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Undavalli Arun Kumar
న్యూఢిల్లీ/హైదరాబాద్: హైదరాబాదు దేశానికి రెండో రాజధాని అనేది రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ది అని రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గురువారం అన్నారు. ఈ రాత్రికి సీమాంధ్ర నేతలం భేటీ అయి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. తాము రాజధాని విషయం ఆధారంగానే విభజనకు ఒప్పుకోవడం లేదన్నారు. రాష్ట్ర విభజన విషయంలో ఇంత వరకు బిల్లులపై విప్ జారీ చేయలేదన్నారు.

సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనల పైన కూడా స్పందించారు. ఎక్కడైనా ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళనలు జరగాలన్నారు. తమ పార్టీకి చెందిన నేతల విగ్రహాలను కూల్చడం శోచనీయమన్నారు. విగ్రహాలను కాల్చివేసే సంస్కృతి కొత్తగా వచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్రిక్తలు తగ్గించే ప్రయత్నాలు విధ్వంసాలకు పాల్పడితే ఇబ్బందులు తప్పవన్నారు.

అండగా నిలబడతాం: మందకృష్ణ

ఉత్తరాంధ్ర వారు ప్రత్యేక ప్యాకేజీ కోసం పోరాడితే తాము అండగా నిలబడతామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తమ పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి ఉనికి కోల్పోవద్దన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామిగా మారి ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చాలన్నారు. కెసిఆర్ కన్నా తెలంగాణకు కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఎక్కువ చేశారన్నారు.

బిల్లుకు మద్దతు: సుష్మా

పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెడితే తాము మద్దతిస్తామని బిజెపి లోకసభ నేత సుష్మా స్వరాజ్ అన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెసు పార్టీ నుండే ప్రకటన వచ్చిందని, బిల్లు పెడితే సహకరిస్తామన్నారు.

4న ఢిల్లీకి కెసిఆర్

కెసిఆర్ ఈ నెల 4న ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించినందున ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉంది. పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీకి వెళ్తున్నారు.

English summary

 Rajahmundry MP Undavalli Arun Kumar has said on Thursday that they are opposing Telangana due to Hyderabad only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X