వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాకేమిచ్చారు?: కాటసాని, జగన్ అవకాశవాది: సాకె

By Srinivas
|
Google Oneindia TeluguNews

Katasani Rambhupal Reddy - Sailajanath
హైదరాబాద్: తెలంగాణకు పోలవరం ప్రాజెక్టు ఇచ్చారు, రాష్ట్రం ఇచ్చారు.. మరి తమకేమిచ్చారని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గురువారం ప్రశ్నించారు. మినిస్టర్స్ క్వార్టర్సులో సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. తమను రాజధాని నుండి విడగొట్టే చర్యలను సహించేది లేదన్నారు. హైదరాబాదు నుండి తమను విడదీయవద్దన్నారు. మా రాజధానిని ఇక్కడికిచ్చామని, ఇప్పుడు తమను వెళ్లమంటే ఎలా అని ప్రశ్నించారు. విభజన అనివార్యమైనప్పుడు తాము ఏం కావాలో ఆలోచిస్తామని, హైదరాబాదును మాత్రం వదులుకునే ప్రసక్తి లేదన్నారు.

జగన్, బాబుల వల్లే: శైలజానాథ్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీది అవకాశవాదమని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు సిగ్గు చేటని మంత్రి శైలజానాథ్ అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తాము స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేస్తామన్నారు. ఇప్పుడు రాజకీయం కోసం సమైక్యమంటున్న జగన్ పార్టీ, నాడు అఖిల పక్ష సమావేశంలో ఏం చెప్పిందో గుర్తు చేసుకోవాలన్నారు. తెలంగాణకు అనుకూలమని చెప్పి బాబు రాష్ట్రాన్ని ముక్కలు చేశారన్నారు. తెలంగాణపై ప్రాసెస్ ప్రారంభమైందని, ఆపేందుకు తాము ప్రయత్నాలు చేస్తామన్నారు.

ఇప్పుడే రాజీనామా: శిల్ప

తాను, కాటసాని రాంభూపాల్ రెడ్డి, లబ్బి వెంకట స్వామిలం ఇప్పుడే రాజీనామా చేస్తున్నామని శిల్పా మోహన్ రెడ్డి చెప్పారు. స్పీకర్‌ను కలిసి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యామన్నారు. తాము ప్రస్తుతం పదవులకు చేస్తున్నామని, పార్టీకి చేయాలా లేదా అనేది నిర్ణయించుకుంటామన్నారు.

రాజకీయ కారణాలతోనే: పార్థసారథి

కేవలం రాజకీయ కారణాలతోనే రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. తాను అందరికంటే ముందే రాజీనామా చేశానని, మిగిలిన వారు కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని కడప జిల్లా ఆదినారాయణ రెడ్డి అన్నారు.

కాగా సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు చంద్రబాబు, జగన్‌ను టార్గెట్ చేసుకున్నారు. అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి, మంత్రులు టిజి వెంకటేష్, పార్థసారథి, శైలజానాథ్ తదితరులు అందరూ రాష్ట్రం ముక్కలు కావడానికి చంద్రబాబే, జగనే కారణమని ఆరోపించారు.

English summary

 Kurnool district Congress Panyam MLA Katasani Rambhupal Reddy has said that Telangana region is getting Polavaram Project and Seperate state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X