వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిలా ముంబై: శోభా డే ట్వీట్, డైవర్స్ కాదని రాజ్ ఎద్దేవా

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు ముంబైని మాత్రం ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ప్రకటించకూడదని ప్రముఖ రచయిత్రి, పత్రికా రచయిత శోభా డే ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలపై పలువురు మండిపడ్డారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ సెటైర్ వేశారు. అది విడాకులు పొందినంత సులభం కాదు సుమా! అంటూ ఎద్దేవా చేశారు.

"ముంబై నగరం మహారాష్ట్రలో భాగం కావడానికి 105 మంది అమరులయ్యారని శోభా డే వంటి వ్యక్తి మరచిపోకూడదని భారతీయ జనతా పార్టీ నేత వినోద్ తవ్డే వ్యాఖ్యానించారు. ఇక ట్విట్టర్ నుంచి ఆ వ్యాఖ్యను తక్షణం తొలగించి, క్షమాపణ చెప్పాలని శివసేన డిమాండ్ చేసింది.

Shobhaa de's tweet on Mumbai

తెలంగాణపై రాజ్‌నాథ్ సింగ్

తెలంగాణపై కాంగ్రెసు పార్టీ తీసుకున్న నిర్ణయం సమయానికి తీసుకున్నది కాదని బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. తెలంగాణ కోసం యువత ఎవరైతే ఆత్మార్పణ చేసుకున్నారో వారంతా ఈ రాష్ట్ర ఏర్పాటును ప్రత్యక్షంగా చూడాలని తాము కోరుకున్నామని, అప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం నిర్ణయించారన్నారు.

తెలంగాణ ప్రకటన నేపథ్యంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం వస్తున్న డిమాండ్లపై రాజ్ స్పందిస్తూ... ఎస్సార్సీని వెంటనే నియమించి, ఆయా ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ఈ సంఘం ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. తెలంగాణపై నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

English summary
The Columnist and Novelist's tweet created a furore among politicians and people who felt she should have refrained from commenting on the sensitive topic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X