వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన: బాబుకు జగన్ పార్టీ నేత ప్రశంసలు

By Pratap
|
Google Oneindia TeluguNews

dwarampudi chandrasekhar reddy
కాకినాడ/ హైదరాబాద్: రాష్ట్ర విభజనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనుసరించిన వైఖరిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, కాకినాడ అర్బన్ మాజీ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖరెడ్డి ప్రశంసలు కురిపించారు. కాకినాడలోని మసీద్ సెంటర్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి హాజరైన ద్వారంపూడి మాట్లాడారు.

హైదరాబాద్ అభివృద్ధికి ఖర్చైన రూ.5 లక్షల కోట్లు మొత్తాన్ని సీమాంధ్ర రాజధానికి కేటాయించాలనే చంద్రబాబు అన్నారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబు తప్పేమీ లేదని స్పష్టం చేశారు. విభజనపై చంద్రబాబుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులంతా తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి మాటలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

యుపిఎ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద తప్పిదాల వల్లనే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎన్.జయప్రకాశ్‌నారాయణ్(జెపి) అన్నారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఒక రాష్ట్ర భవిష్యత్తును ఆ రాష్ట్రంలోనే తేలాలని, తేలని పరిస్థితుల్లో కేంద్రం పెద్దరికంతో వ్యవహరించి, అందరినీ కూర్చోబెట్టి రాజీ చేయాలని ఆయన అన్నారు.

రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయకుండా ఒక చక్రవర్తిలా హుకుం జారీ చేసి మాకు నచ్చింది చేస్తామని, మీరు ఒప్పుకుని తీరాలన్నట్లు వ్యవహరించి రాష్ట్రంలో చిచ్చుపెట్టిందని ధ్వజమెత్తారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఏ ఎండకాగొడుగు పట్టాయన్నారు.

English summary
YS Jagan's YSR Congress party leader and Kakinada urban ex MLA Dwarampudi Chandrasekhar Reddy has praised the Telugudesam party president Nara Chandrababu Naidu on Andhra Pradesh bifurcation issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X